Sand Dispute
Sand Dispute : విజయనగరం జిల్లాలో రెండు గ్రామాల మధ్య ఇసుక పంచాయితీ ఘర్షణకు దారి తీసింది. ఆఘర్షణతో పక్క గ్రామానికి చెందిన విద్యార్ధులు తమ ఊరి బడిలో చదవటానికి వీలు లేదని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో పూసపాటిరేగ మండలంలో రెండు గ్రామాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలొకొంది.
లంకలపాలెం సమీపంలో ఉన్న తంగవలస గడ్డ నుంచి గోవిందపురం వాసులు ఇసుకను తరలిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న జగన్నన ఇళ్ల నిర్మాణానికి ఈ ఇసుకను ఉపయోగిస్తున్నారు. తమ గ్రామం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని లంకలపాలెం వాసులు ఆరోపిస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇసుక తరలింపుతో తమ గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంతో సోమవారం ఇసుక తరలిస్తున్న వాహనాలను లంకలపాలెం వాసులు అడ్డుకున్నారు. ఈ వివాదం పెరిగి పెద్దదయ్యింది.
లంకలపల్లికి చెందిన విద్యార్ధులు గోవిందపురంలోని స్కూలులో చదువుతున్నారు. వారు ఈరోజు స్కూలుకు వెళ్దామని ప్రయత్నం చేయగా గోవిందా పురం వాసులు వారిని అడ్డుకున్నారు.
Also Read : Gang Attack : హోటల్‌పై రౌడీల దాడి-దౌర్జన్యంగా నగదు ఎత్తుకెళ్లిన గ్యాంగ్
తమను ఇసుక తరలింపు చేయనీయకుండా అడ్డుకున్నందుకు లంకలపల్లికి చెందిన విద్యార్ధులు తమ ఊరి స్కూల్‌లో చదవడానికి వీల్లేదంటూ లంకలపాలెం విద్యార్థులను గోవిందపురం వాసులు అడ్డుకున్నారు. దీంతో రెండు గ్రామల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రెండు గ్రామాల మధ్య భారీగా పోలీసులను మోహరించారు.