రాజస్థాన్ లో ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది. జైపూర్ లోని సెయింట్ సేవియర్స్ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్ధులు ఎడ్యూకేషన్ టూర్ లో భాగంగా పర్యటిస్తున్నప్పుడు పోఖ్రాన్ కి దగ్గర్లోని ఓ టోల్ ఫ్లాజా దగ్గర శనివారం(అక్టోబర్-5,2019)స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18మంది చిన్నారులు,ఓ టీచర్ గాయపడ్డారు.
బస్సులో మొత్తం 140మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. స్థానికుల సహాయంతో పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. గాయపడిన చిన్నారులను ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కు తరలించారు. తీవ్రగాయాలపాలైన టీచర్ ను బెటర్ ట్రీట్మెంట్ కోసం జోథ్ పూర్ హాస్పిటల్ కు తరలించా