Hyderabad: హైదరాబాద్‌లో సినిమాకు వెళ్లిన స్కూల్ విద్యార్థులకు ప్రమాదం.. ఎస్కలేటర్ స్పీడ్‌గా వెళ్లడంతో..
‘గాంధీ’ సినిమా చూసేందుకు వెళ్లిన స్కూల్ విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటన గురువారం ఉదయం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జరిగింది. ఘటనలో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని ప్రిన్సిపాల్ తెలిపారు.
- Narender Thiru
- Published On : August 18, 2022 / 01:04 PM IST
Hyderabad: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సినిమా చూసేందుకు వెళ్లిన స్కూల్ విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. స్థానిక ఆర్‌కే సినీప్లెక్స్‌లో ‘గాంధీ’ సినిమా ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా చూసేందుకు భారతీయ విద్యా భవన్ స్కూల్ విద్యార్థులు వెళ్లారు.
Tamil Nadu: భర్తపై అనుమానంతో.. మర్మాంగాలపై వేడి నీళ్లు పోసిన భార్య
అయితే, మాల్ లోపల ఎస్కలేటర్ ప్రమాదంలో గాయపడ్డారు. ఎస్కలేటర్ స్పీడ్‌గా వెళ్లడంతో విద్యార్థులంతా ఒకరిపై ఒకరు పడ్డారు. ఈ ఘటనలో దాదాపు పది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే విద్యార్థుల్ని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ వీరికి ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. ఈ ఘటనపై స్కూల్ ప్రిన్సిపాల్ స్పందించారు. 6-12వ తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులు సినిమాకు వెళ్లారని, వారి వెంట ఒక టీచర్ కూడా ఉన్నారని ప్రిన్సిపాల్ చెప్పారు. ఈ ఘటనలో ఆర్‌కే సినీప్లెక్స్ వాళ్లదే తప్పన్నారు.
Monkeypox: మంకీపాక్స్ వ్యాక్సిన్ సురక్షితమేమీ కాదు: ప్రపంచ ఆరోగ్య సంస్థ
‘‘విద్యార్థులు వెళ్లడం వల్ల ఓవర్ లోడ్ కాలేదు. ఎస్కలేటర్ రివర్స్ అయిపోవడంతో పిల్లలు ఒకరిపై ఒకరు పడ్డారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాలేదు. పది మంది విద్యార్థులు మాత్రమే స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విద్యార్థులంతా క్షేమంగానే ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించాం. ఎవరూ, ఎలాంటి ఆందోళన చెందవద్దు’’ అని ప్రిన్సిపాల్ తెలిపారు.
