Monkeypox: మంకీపాక్స్ వ్యాక్సిన్ సురక్షితమేమీ కాదు: ప్రపంచ ఆరోగ్య సంస్థ

మంకీపాక్స్ వ్యాక్సిన్ వంద శాతం సురక్షితం కాదని.. అందువల్ల వ్యాధి సోకకుండా చూసుకోవడమే మేలని ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మరోవైపు దేశంలో మంకీపాక్స్ వ్యాక్సిన్ తయారీ కోసం కేంద్రం ప్రయత్నిస్తోంది.

Monkeypox: మంకీపాక్స్ వ్యాక్సిన్ సురక్షితమేమీ కాదు: ప్రపంచ ఆరోగ్య సంస్థ

Monkeypox: మంకీపాక్స్ వ్యాక్సిన్ వంద శాతం సురక్షితమేమీ కాదని ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ). అందువల్ల ప్రజలే మంకీపాక్స్ సోకకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల మంకీపాక్స్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గడిచిన వారంలో ప్రపంచవ్యాప్తంగా 7,500 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.

Tamil Nadu: భర్తపై అనుమానంతో.. మర్మాంగాలపై వేడి నీళ్లు పోసిన భార్య

అంతకుముందు వారంతో పోలిస్తే ఇది 20 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఇప్పటివరకు 92 దేశాల్లో కలిపి, 35,000కు పైగా కేసులు నమోదయ్యాయి. 12 మంది ఈ వ్యాధి కారణంగా మరణించారు. మంకీపాక్స్ కేసుల అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి టెడ్రాస్ అదానామ్ గెబ్రెయెసస్ మీడియాతో మాట్లాడారు. అందరూ ఈ వ్యాధి విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ‘‘ప్రస్తుతం అందుబాటులో ఉన్న మంకీపాక్స్ వ్యాక్సిన్లు వంద శాతం సురక్షితం కాదు. ఇవి కచ్చితంగా పనిచేస్తాయని చెప్పలేం. అందువల్ల త్వరగా వ్యాధి సోకే అవకాశాలు ఉన్న వాళ్లు, వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి ఇబ్బంది పడే వాళ్లు.. మంకీపాక్స్ సోకకుండా చూసుకోవడమే మంచిది.

Saudi Woman: ట్విట్టర్ వాడినందుకు సౌదీలో మహిళకు 34 ఏళ్ల జైలు శిక్ష

వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ వ్యాధి సోకే అవకాశాల్ని తగ్గించుకోవాలి. అంటే వ్యాధి సోకే అవకాశం ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం, శానిటైజేషన్ వంటి జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని టెడ్రాస్ అన్నారు. మన దేశంలో కూడా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు పది కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు. దేశంలో మంకీపాక్స్ వ్యాక్సిన్ తయారీ కోసం కేంద్రం ప్రయత్నిస్తోంది. మంకీపాక్స్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.