Kurnool Check Post : ఐదు కోట్లు విలువైన బంగారం, వెండి, నగదు స్వాధీనం

కర్నూలు జిల్లాలో భారీగా బంగారం, వెండి పట్టుకున్నారు అధికారులు. 5 కోట్లుకు పైగా విలువైన బంగారు, వెండి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాదు నుంచి కోయంబత్తూరుకు వెళుతున్న స్వామి అయ్యప్ప ట

Kurnool Check Post : కర్నూలు జిల్లాలో భారీగా బంగారం, వెండి పట్టుకున్నారు అధికారులు. 5 కోట్లుకు పైగా విలువైన బంగారు, వెండి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాదు నుంచి కోయంబత్తూరుకు వెళుతున్న స్వామి అయ్యప్ప ట్రావెల్స్‌ బస్సులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు తనిఖీ చేశారు.

బస్సులో ఐదుగురు ప్రయాణికుల నుంచి భారీగా నగదుతోపాటు బంగారం, వెండి లభ్యమైంది. 28.5 కేజీల వెండి బిస్కెట్లు, 8.250 కేజీల బంగారు బిస్కెట్లు, 90 లక్షల నగదు సీజ్‌ చేశారు. పట్టుబడిన వారంతా తమిళనాడులోని సేలం పట్టణానికి చెందిన దేవరాజు, సెల్వరాజు, కుమార వేలు, మేయలాగ మురుగేశన్, కోయంబత్తూరుకు చెందిన వెంకటేశ్‌గా గుర్తించారు.
Also  Read : Bigg Boss OTT Telugu: కాలేజీలో ప్రేమ.. బిందు మాధవి లవ్ ఫెయిల్యూర్ స్టోరీ
వినూత్న రీతిలో వీటిని తరలించేందుకు వీరు ఏర్పాట్లు చేసుకున్నారు. చొక్కాలో, జిప్‌ జేబులో దాచి పెట్టారు. అయితే ఇవి ఎవరికి చెందినవనే వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు అధికారులు. ఇంత భారీ మొత్తంలో ఎక్కడికి తరలిస్తున్నారని దర్యాప్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు