Bigg Boss OTT Telugu: కాలేజీలో ప్రేమ.. బిందు మాధవి లవ్ ఫెయిల్యూర్ స్టోరీ

నో కామా.. నో ఫుల్‌స్టాప్.. బిగ్‌బాస్ అయింది ఇక నాన్‌స్టాప్ అంటూ ప్రేక్షకులలో ఉన్న బిగ్ బాస్ ఫీవర్ ను ఇక రోజంతా ఉండేలా ప్లాన్ చేసి 24 గంటల పాటు పూర్తి స్థాయి వినోదాన్ని పంచడానికి..

Bigg Boss OTT Telugu: కాలేజీలో ప్రేమ.. బిందు మాధవి లవ్ ఫెయిల్యూర్ స్టోరీ

Bigg Boss Ott Telugu

Bigg Boss OTT Telugu: నో కామా.. నో ఫుల్‌స్టాప్.. బిగ్‌బాస్ అయింది ఇక నాన్‌స్టాప్ అంటూ ప్రేక్షకులలో ఉన్న బిగ్ బాస్ ఫీవర్ ను ఇక రోజంతా ఉండేలా ప్లాన్ చేసి 24 గంటల పాటు పూర్తి స్థాయి వినోదాన్ని పంచడానికి ఓటీటీ బిగ్ బాస్ తెలుగు ప్రసారం మొదలైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న డిస్నీ హాట్ స్టార్‌లో మొదలైన ఈ షో ప్రసారం అప్పుడే వారం గడిచిపోయింది. దీంతో కెప్టెన్సీ టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. అలకలు, ఏడుపులు కూడా ఇంట్లో మొదలైపోయాయి.

Bigg Boss OTT Telugu: నాకు ఇద్దరు.. నాకు ముగ్గురు.. హౌస్‌లో డేటింగ్ హిస్టరీ!

పాత వాళ్ళు వారియర్స్, కొత్త వాళ్ళు చాలెంజర్స్ అంటూ రెండు టీమ్స్ చేసిన బిగ్ బాస్.. రెండు గ్రూపుల మధ్య పెట్టే టాస్కులతో హోరాహోరీగా ఈ షో నడుస్తుండగా.. బిగ్ బాస్ తాజాగా కంటెస్టెంట్లు వారి వ్యక్తిగత విషయాలను హౌస్‌మేట్స్‌తో పంచుకోవాలనే టాస్క్‌ ఇచ్చాడు. అందులో భాగంగా హీరోయిన్ బిందుమాధవి తన లవ్‌ స్టోరీని చెప్పుకొచ్చింది. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ఒకతన్ని ప్రేమించానని.. తాను కూడా నన్ను ప్రేమించాడని.. ఇద్దరం ప్రేమలో ఉండగానే కెరీర్‌ కోసం దూరమవ్వాల్సి వచ్చిందని తెలిపింది.

Bigg Boss OTT Telugu: హౌస్ నిండా బోల్డ్ బ్యూటీస్.. బిగ్‌బాస్ ఏం స్కెచ్ వేశాడో?

అతడు పై చదువుల కోసం అమెరికా వెళ్లిపోగా.. తాను యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో ఇలా సినీరంగంలోకి వచ్చేశానని పేర్కొంది. ప్రియుడి పేరును వెల్లడించని బిందు ఇప్పుడు అతడికి పెళ్లి కూడా అయిపోయిందని తెలిపింది. అయితే ఇప్పటికీ ఆ రిలేషన్‌ తనకెంతో స్పెషల్‌ అని చెప్పుకొచ్చింది. ఇప్పటికే తమిళ బిగ్‌బాస్‌ లో పాల్గొన్న బిందు మాధవి.. తెలుగమ్మాయిగా ఇప్పుడు తెలుగులోనూ కూడా ఛాన్స్‌ రావడంతో ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ఇలా నాన్‌స్టాప్‌ షోలో అడుగుపెట్టింది.