ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో బ్యాగ్ కలకలం

ఢిల్లీ ఎయిర్ పోర్టులో అనుమానాస్పద బ్యాగ్ కలకలం రేపింది. దీంతో ఎయిర్ పోర్ట్ లో సెక్యూరిటీని టైట్ చేశారు. ఇవాళ(నవంబర్-1,2019)ఉదయం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోని టెర్మినల్ 3దగ్గర ఓ అనుమానాస్పద బ్యాగును సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు ఉదయం 3గంటలకు అనుమానాస్పద బ్యాగు గురించి ఎయిర్ పోలీసులను అలర్ట్ చేస్తూ ఓ ఫోన్ కాల్ వచ్చిందని ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

అనుమానాస్పద బ్యాగును స్పాట్ నుంచి బయటయు తీసుకొచ్చామని,బ్యాగులో ఉన్న కంటెంట్ ను తనీఖీ చేసేందుకు టీమ్ లు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనుమానాస్పద బ్యాగు కలకలంతో కొద్దిసేపు ఎయిర్ పోర్టులో ప్రయాణికుల్లో భయం కలిగింది. ఎరైవల్,ఎగ్జిట్ టర్మినల్ నుంచి ప్రయాణికులను అనుమతించలేదు అధికారులు. టెర్మినల్ 3బయటి రోడ్ లను బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు.