విశాఖలో ఏడుగురు నేవీ సిబ్బంది అరెస్టు

పాకిస్తాన్ తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఏడుగురు నేవీ సిబ్బందిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. గూఢచర్యం వ్యవహారం కేసులో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  • Publish Date - December 20, 2019 / 10:57 AM IST

పాకిస్తాన్ తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఏడుగురు నేవీ సిబ్బందిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. గూఢచర్యం వ్యవహారం కేసులో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పాకిస్తాన్ తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఏడుగురు నేవీ సిబ్బందిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. గూఢచర్యం వ్యవహారం కేసులో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నావికదళ ఇంటెలిజెన్స్, కేంద్ర నిఘా వర్గాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. 

తూర్పునౌకాదళ కమాండ్ కు కీలకమైన డాల్ఫిన్స్ నోస్ కేంద్రంగా గూఢచర్యం రాకెట్ నడుస్తున్నట్ల అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు హవాలా ఆపరేటర్ నూ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు తరలించారు. వీరికి జనవరి 3వరకు రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. 

“ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, నేవల్ ఇంటెలిజెన్స్‌లు కలిసి పాకిస్తాన్‌తో సంబంధాలున్న ఓ గూఢచర్య రాకెట్‌ను బట్టబయలు చేశారు. నేవీకి చెందిన ఏడుగురు ఉద్యోగులతో పాటు, ఓ హవాలా ఆపరేటర్‌ను కూడా అరెస్ట్ చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరికొంతమంది అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. విచారణ జరుగుతోంది” అని ‘ఆపరేషన్ డాల్ఫిన్స్ నోస్’ పేరుతో విడుదల చేసిన ఓ ప్రకటనలో ఏపీ డీజీపీ కార్యాలయం పేర్కొంది. వీరంతా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు అని ఆ ప్రకటనలో తెలిపారు.