Bengaluru : విద్యార్థులు అదృశ్యం, అందులో ఒకరు కాలేజీ స్టూడెంట్..ఎందుకు వెళ్లారో తెలుసా ?

రెండు రోజుల్లో జరిగిన వేర్వేరు ఘటనలో కాలేజీ అమ్మాయితో సహా ఏడుగురు విద్యార్థులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది.

Seven Students Missing : రెండు రోజుల్లో జరిగిన వేర్వేరు ఘటనలో కాలేజీ అమ్మాయితో సహా ఏడుగురు విద్యార్థులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. వారి వారి నివాసాల నుంచి లేఖలను స్వాధీనం చేసుకున్నారు. చదువుపై ఆసక్తి చూపకపోవడంతోనే ఇంటి నుంచి వెళ్లిపోయారని తెలుస్తోందని పోలీసులు వెల్లడిస్తున్నారు. హేసరఘట్ట రోడ్డులోని సౌందర్య లేవుట్ లో నివాసం ఉంటున్న పరీక్షిత్, నందన్, కిరణ్ లు పదో తరగతి చదువుతున్నారు.

Read More : Jammu Kashmir: ఎన్‌కౌంటర్లతో అట్టుడుకుతున్న కశ్మీర్

వీరు..శనివారం ఉదయం నుంచి అదృశ్యమయ్యారు. సాయంత్రం వరకు తల్లిదండ్రులు పలు చోట్ల వెతికారు. ఫలితం కనబడకపోయేసరికి…పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి వారి నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. వాళ్లు విడివిడిగా వదిలిపెట్టిన లేఖలను స్వాధీనం చేసుకున్నారు. తమకు చదువు కంటే క్రీడలపై ఆసక్తి ఉందని, ఎంత ఒత్తిడి చేసినా చదువ లేకపోతున్నామని…క్రీడారంగంలో తమ కెరీర్ ను నిర్మించుకుంటామని అందులో వెల్లడించారు. తమకు కబడ్డీ ఆట అంటే ఎంతో ఇష్టమని, ఇందులో మంచి పేరు సంపాదిస్తామని లేఖలో పేర్కొన్నారు. ఈ ఫీల్డ్ లో పేరు తెచ్చుకున్న తర్వాతే..కలుస్తామని అదృశ్యమైన విద్యార్థులు తెలిపారు. తమ కోసం వెతకవద్దని కోరారు. సీసీ కెమెరాలు, స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

Read More : Jammu and Kashmir : జమ్మూకశ్మీర్‌..30 గంటల వ్యవధిలో 5 ఎన్‌కౌంటర్లు

క్రిస్టల్ అపార్ట్ మెంట్ లో 12 ఏళ్ల వయస్సున్న రోయన్, సిద్ధార్థ్, చింతన్, భూమిలు నివాసం ఉంటున్నారు. వీరు ఆదివారం అదృశ్యమయ్యారు. ఇళ్లకు తిరిగి రాకపోవడంతో సోలదేవనహళ్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. తమ పిల్లలు అమృత వర్షిణితో ఎక్కువ సమయం గడిపేవారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. పిల్లలను ఆమె తీసుకెళ్లిందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఓ ఇంటి వద్ద లేఖ దొరికింది. ఇందులో చెప్పులు, టూత్ బ్రష్ లు, టూత్ పేస్టు, వాటర్ బాటిల్, నగదు, క్రీడలకు సంబంధించిన వస్తువులను తీసుకెళ్లాలని అందులో పేర్కొన్నట్లు తెలుసుకున్నారు. అమృత వర్షిణి బీసీఎ థర్డ్ సెమిస్టర్ చదివినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు