మీ రూ.500 నోటు ఒరిజనలేనా? హైదరాబాద్‌లో దొంగ నోట్ల కలకలం, భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత

నకిలీ నోట్ల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Fake Currency : హైదరాబాద్ లో దొంగ నోట్ల కలకలం రేగింది. పోలీసులు భారీగా నకిలీ కరెన్సీ పట్టుకున్నారు. మైలార్ దేవ్ పల్లి లో 7 లక్షల విలువ చేసే 500 రూపాయల ఫేక్ కరెన్సీని సీజ్ చేశారు శంషాబాద్ ఎస్ఓటీ టీమ్. ‌ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. గంగరాజు, అభినందన్ వద్ద 10 కట్టల ఫేక్ 500 రూపాయల కరెన్సీ గుర్తించారు. మహారాష్ట్రలో ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఫేస్‌బుక్ లో పరిచయం అయిన మహారాష్ట్రకు చెందిన సచిన్ పవార్, సురేశ్ లతో కలిసి నకిలీ కరెన్సీ ముద్రణ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు 17 లక్షల రూపాయల విలువైన ఫేక్ కరెన్సీని ప్రింటింగ్ చేసినట్లు విచారణలో వెలుగుచూసింది. ప్రింటింగ్ చేసిన ఫేక్ కరెన్సీని వివిధ రాష్ట్రాలలో ఏజెంట్స్ ద్వారా చెలామణికి స్కెచ్ వేశారు.

బెంగుళూరులో తమిళనాడుకి చెందిన రవికి నకిలీ కరెన్సీ విక్రయించే యత్నం చేశాడు గంగరాజు. రవితో డీల్ కుదరక పోవడంతో అక్కడి నుండి హైదరాబాద్ చేరుకున్నాడు. సికింద్రాబాద్ మల్కాజ్‌గిరి లోని ఓ హోటల్ లో బస చేసి నరేశ్ అనే వ్యక్తి ద్వారా బైక్ అధ్దెకు తీసుకున్నాడు నిందితుడు. అద్దె బైక్ పై ఫేక్ కరెన్సీ తీసుకొని రాజేంద్రనగర్ కు చేరుకున్నాడు గంగరాజు. మైలార్ దేవ్ పల్లి మెహఫిల్ హోటల్ లో నకిలీ కరెన్సీ చెలామణికి డీల్ కుదుర్చుకున్నాడు. డీల్ జరుగుతుండగా ఎస్ఓటీ బృందం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

ఫేక్ కరెన్సీ గుట్టును రట్టు చేశారు పోలీసులు. నకిలీ నోట్ల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఫేక్ కరెన్సీ చెలామణిలో ఎవరెవరు ఉన్నారు? అనే పూర్తి సమాచారాన్ని కూపీ లాగుతున్నారు. ఫేక్ కరెన్సీ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు బదులు చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ముద్రణ ఉంటుంది. అది తప్పా మక్కీకి మక్కీ ప్రింట్ చేశారు కేటుగాళ్లు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా మైలార్ దేవ్ పల్లి పోలీసులు.

Also Read : ఈ సిగరెట్లు తాగితే చావు ఖాయం..! రూ.2కోట్ల విలువైన నకిలీ సిగరెట్లు సీజ్

ట్రెండింగ్ వార్తలు