Fake Cigarettes Seized : ఈ సిగరెట్లు తాగితే చావు ఖాయం..! రూ.2కోట్ల విలువైన నకిలీ సిగరెట్లు సీజ్

దీనికి సంబంధించి నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

Fake Cigarettes Seized : ఈ సిగరెట్లు తాగితే చావు ఖాయం..! రూ.2కోట్ల విలువైన నకిలీ సిగరెట్లు సీజ్

Fake Cigarettes Seized

Updated On : April 11, 2024 / 12:00 AM IST

Fake Cigarettes Seized : హైదరాబాద్ రాజేంద్రనగర్ లో భారీగా నకిలీ సిగరెట్లను పోలీసులు పట్టుకున్నారు. 2 కోట్ల రూపాయల విలువ చేసే వివిధ బ్రాండ్ల నకిలీ సిగరెట్లను రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు సీజ్ చేశారు. బీహార్ నుంచి హైదరాబాద్ కు కంటైనర్ లో సిగరెట్లను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

నిజానికి స్మోకింగ్ అనేదే ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ అలవాటు మంచి కాదంటారు డాక్టర్లు. స్మోకింగ్ అలవాటుతో క్రమంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాంటిది నకిలీ సిగరెట్లు మరింత హానికరం అని అంటున్నారు. నకిలీ సిగరెట్లు తయారు చేసి వాటికి బ్రాండెడ్ కంపెనీ లేబుల్స్ అతికించి గుట్టు చప్పుడు కాకుండా మార్కెట్ లో విక్రయిస్తున్నారు కేటుగాళ్లు. ఇలాంటి సిగరెట్లు ఆరోగ్యానికి మరింత హాని చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. కొందరు కాసుల కక్కుర్తితో అన్నింటిని కల్తీ చేసి మనుషుల ప్రాణలతో చెలగాటం ఆడుతున్నారు.

Also Read : ఒళ్లుగగుర్పొడిచే ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టి గాల్లో పల్టీలు కొట్టిన కారు.. వీడియో వైరల్