ఓ మందుబాబుకు ఎక్కిన మద్యం కిక్కు ఊరంతటినీ హడలెత్తించేసింది. పరుగులు పెట్టించింది. వీడు మనీషేనా? మనిషి మాంసంతో కూర వండేసిన వీడసలు మనిషేనా? లేక నరమాంస భక్షకుడా? అంటూ ఊరు ఊరంతా హడలిపోయింది.
వివరాల్లోకి వెళితే..ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నూర్ జిల్లా టిక్కోపూర్ గ్రామానికి చెందిన 32 ఏళ్ల సంజయ్ పచ్చి తాగుబోతు. ఇష్టమొచ్చినట్లుగా తాగి తందనాలడటమే కాక..భార్యా పిల్లలు నానా హింసలు పెడుతుంటాడు. పిచ్చి పిచ్చి ప్రవర్తిస్తుంటాడు. కానీ ఓ రోజున అతడు వంటగదిలో చేస్తున్న పని చూసిన అతని భార్య హడలిపోయింది.
సోమవారం (మార్చి 9,2020) రాత్రి ఫుల్లుగా మద్యం తాగిన సంజయ్ రోజులాగనే ఫుల్లుగా తాగాడు. ఏం చేస్తున్నాడో తెలియకుండా..గ్రామ శివారులో ఓ శవం చేయిని కోసుకుని ఇంటికి తెచ్చాడు. తరువాత ఆ చేతి చేతి వేళ్లు నరికి కూర వండే పాత్రలో వేసి వండటం ప్రారంభించాడు.
అదే సమయంలో మార్కెట్ నుంచి ఇంటికొచ్చిన అతడి భార్య కిచెన్‌లో భర్త చేస్తున్న పని చూసి హడలిపోయింది. వంటగదిలో కూరగాయల ముక్కలా మనిషి వేళ్లు కట్ చేసి ఉండటం చూసింది. పక్కనే కట్ చేసిన మనిషి చేయి పడిఉండటం చూసింది.నోట మాట రాక కొయ్యముక్కలా బిగుసుకుపోయింది. ఆమె కొంతసేపటికి కోలుకుని చుట్టు పక్కలవారిని పిలిచి భర్త చేస్తున్న నిర్వాకం చూపించింది.
అది చూసిన వారు కూడా షాక్ అయ్యారు. నువ్వు మనిషివేనా? అంటూ తిట్టిపోశారు. అయినా సంజయ్ లో ఏమాత్రం సోయ లేదు. తాను చేసే పని ఆపలేదు. దీంతో స్థానికులు పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే సంజయ్ ఇంటికి వచ్చిన పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. మద్యం మత్తులో ఉన్న సంజయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై పోలీస్ అధికారి ఆర్ సీ శర్మ మాట్లాడుతూ..స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంజయ్ ఇంటికి వెళ్లి చూడగా.. కట్ చేసిన మనిషి చేతి మాంసాన్ని చూశామని తెలిపారు. సంజయ్ ను విచారించగా.. గంగానదిలో కొట్టుకువచ్చిన శవం చేతిని కోసి పట్టుకొచ్చానని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యామని తెలిపారు. దీనిపై విచారణ చేస్తున్నట్టు తెలిపారు.
See Also | మధ్యప్రదేశ్‌లో పొలిటికల్ హైడ్రామా.. బీజేపీదే పైచేయి!