ఉరిశిక్ష విధించబడ్డ ఖైదీలను మంచి ప్రవర్తన కారణంగా మరణశిక్ష నుంచి దోషులను వదిలిపెట్టే పాజిబులిటీపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏడుగరు కుటుంబసభ్యులను చంపిన కేసులో ఉరిశిక్ష విధించిన ఓ మహిళ,ఆమె ప్రియుడు తమకు విధించిన ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలని వేసిన పిటిషన్ పై తీర్పుని రిజర్వ్ లో ఉంచుతూ…మంచి ప్రవర్తన కారణంగా మరణశిక్ష నుంచి దోషులను వదిలిపెడితే… అలాంటి చర్య ఇలాంటి పిటిషన్లకు ఫ్లడ్ గేట్లను తెరుస్తుందని సీజేఐ ఎస్ఏ బోబ్డే అన్నారు.
ఉత్తరప్రదేశ్ లోని అల్మోరాలో 2008లో ఏడుగురు కుటుంబసభ్యులు(10ఏళ్ల చిన్నారితో సహా)ను చంపిన కేసులో షబ్నాం అనే మహిళ,ఆమె ప్రియుడు సలీం దోషులుగా తేలారు. ప్రియుడు సలీంని పెళ్లి చేసుకోవాలని అనుకున్న షాబ్నాం నిర్ణయాన్ని ఆమె కుటుంబం వ్యతిరేకించింది. దీంతో ప్రియుడు సలీమ్‌తో కలిసి షాబ్నాం తన కుటుంబ సభ్యులను మత్తుమందులతో కూడిన పాలు తాగించి చంపేసింది. ఈ కేసులో 2010లో సెషన్స్ కోర్టు వారికి మరణశిక్ష విధించింది. అయితే మూడేళ్ల తర్వాత అలహాబాద్ హైకోర్టు సెషన్స్ కోర్టు తీర్పుని ఆపి ఉంచింది. 2015లో సుప్రీంకోర్టు వారిద్దరికి ఉరిశిక్షను కన్ఫర్మ్ చేసింది.
అయితే ఇవాళ తమకు విధించిన ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలని దోషుల పిటిషన్ పై సుప్రీంలో విచారణ జరిగింది. నిందితుడు సలీం తరపు న్యాయవాది ఆనంద్ గ్రోవర్ కోర్టులో …తన క్లయింట్ నేరం జరిగిన సమయంలో “చదువురానివాడు” అని వాదించాడు. అయితే, అతను జైలులో డిగ్రీ సంపాదించాడు మరియు ఇప్పుడు తన మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. అతను ఇప్పుడు సంస్కరించబడినందున, అతని శిక్షను రద్దు చేయాలని ఆనంద్ గ్రోవర్ జడ్జికి విజ్ఞప్తి చేశారు. నిందితురాలు షాబ్నం తరపున వాదనలు వినిపించిన లాయర్ మీనాక్షి అరోరా…తన క్లయింట్ నేరం చేసిన పరిస్థితులు, ఆమె జైలులో సత్ ప్రవర్తన కారణంగా ఆమె శిక్షను తగ్గించమని కోర్టును కోరింది.
అయితే వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే…పుట్టేటప్పుడూ ఎవ్వరూ క్రిమినల్ గా పుట్టరని అన్నారు. వాళ్లు చేసిన హత్యలు…ముందస్తుగా మరియు సూక్ష్మంగా ప్రణాళిక చేయబడినవి” అని గమనించిన చీఫ్ జస్టిస్ బొబ్డే..ఇటువంటి వ్యక్తులను విడిచిపెడితే నేర న్యాయ వ్యవస్థ యొక్క స్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. మరణశిక్ష యొక్క తుది నిర్ధారణకు చాలా ప్రాముఖ్యత ఉందని అన్నారు.