విజయవాడ: ఎన్.ఆర్.ఐ, పారిశ్రామిక వేత్త,ఎక్స్ ప్రెస్ న్యూస్ ఛానల్ ఛైర్మన్ జయరాం మర్డర్ కేసులో ఆయన మేనకోడలు శిఖాచౌదరిని కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కంచికచర్ల రూరల్ పోలీసు సర్కిల్ కార్యాలయంలో పొలీసులు శిఖచౌదరిని విచారిస్తున్నారు.
జిల్లా ఎస్పీ త్రిపాటి, డిఎస్పీ బోస్, సిఐ, పివి రమణ లు శనివారం మధ్యాహ్నం నుంచి శిఖా చౌదరిని విచారిస్తున్నారు. పోలీసుల అదుపులో శిఖా , ఆమె సహచరుడు రాకేష్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సాయంత్రానికి పోలీసులు శిఖా చౌదరిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.