మూడంతస్తుల భవనంపై నుంచి పడి ఎయిర్ పోర్టు ఉద్యోగిని మృతి చెందిన సంఘటన శంషాబాద్‌లో చోటు చేసుకుంది. ఛాటింగ్ చేస్తూ కిందపడిందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే..ఆమె సెల్ ఫోన్, ల్యాప్ టాప్‌లు ఆన్ చేసి ఉండడమే. ఆమె సోదరుడు మాలిక్ రెహాన్ కంప్లయింట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కర్నాటక రాష్ట్రంలో ముదళీ ప్రాంతానికి చెందిన సిమ్రాన్ (25) శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమర్ సర్వీసులో ఉద్యోగం చేస్తోంది. ఈమె శంషాబాద్‌లోని గాయత్రి పీజీ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటోంది. 2020, జనవరి 14వ తేదీ మంగళవారం సాయంత్రం హాస్టల్ మూడంతస్తుల భవనం నుంచి కిందపడింది. స్థానికులు గమనించి అంబులెన్స్‌కు సమాచాంర అందించారు. అప్పటికే తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయింది.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. ఆమె ఉంటున్న నివాసంలో ల్యాప్ టాప్, సెల్ ఫోన్ ఆన్ చేసి ఉన్నాయి. గత కొద్ది రోజులుగా సిమ్రాన్ డిప్రెషన్ లో ఉంటోందని రూమ్ మేట్స్ వెల్లడించారు. చనిపోక ముందు బాయ్ ఫ్రెండ్‌తో చాటింగ్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మృతి చెందిన విషయాన్ని ఆమె కుటుంబసభ్యులకు చేరవేశారు.
Read More : సందడే సందడి : సంక్రాంతి శుభాకాంక్షలు