Smoke In Spicejet Flight
Smoke In Spicejet Flight : దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానంలో పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదాన్ని గుర్తించిన పైలట్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా లాండింగ్ చేశాడు.
విమానంలో అలుముకున్న పొగలతో ఓ ప్రయాణికురాలు అస్వస్థతకు గురైనట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఎయిర్‌పోర్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. విమానంలో మొత్తం 86 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. విమానం అత్యవసర ల్యాడింగ్ దృష్ట్యా తొమ్మిది విమానాలను దారిమల్లించామని అధికారులు చెప్పారు.
Miami Airport Plane : విమానంలో ఒక్కసారిగా మంటలు.. తప్పిన పెనుప్రమాదం..!
వాటిలో 6 డొమెస్టిక్, 2 అంతర్జాతీయ, ఒక కార్గో విమానం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గతకొంతకాలంగా స్పైస్‌జెట్ విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న విషయం తెలిసిందే.