Miami Airport Plane : విమానంలో ఒక్కసారిగా మంటలు.. తప్పిన పెనుప్రమాదం..!
విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో 126 మంది ప్రయాణికులు ఉన్నారు. రన్‌వేపై విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Miami Airport Plane : విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో 126 మంది ప్రయాణికులు ఉన్నారు. రన్‌వేపై విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ప్రయాణికులందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ముగ్గురికి మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన అమెరికాలోని మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వేపై జరిగింది. రెడ్ ఎయిర్ ఫ్లైట్ ఫ్రంట్ ల్యాండింగ్ గేర్ పెయిలవ్వడంతో విమానంలో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. విమానంలోని ప్రయాణీకులంతా భయంతో వణికిపోయారు.
#NEW: Video shared with @nbc6 by Red Air Flight 203 passenger as they escaped burning plane. Three people were injured.
Investigators say landing gear collapsed as plane landed at Miami International Airport. #Miami pic.twitter.com/LRHI3cGYdL
— Ryan Nelson (@RyanNelsonTV) June 22, 2022
డొమినికన్ రిపబ్లిక్‌లోని శాంటో డొమింగో నుంచి వస్తున్న విమానం కొద్దిసేపట్లో ల్యాండ్ కావాల్సి ఉంది. అదే సమయంలో విమానంలో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. రన్‌వే నుంచి విమానం పక్కకు జరిగిపోయింది. ఈ క్రమంలో విమానం క్రేన్ టవర్ సహా అనేక వస్తువులను ఢీకొట్టింది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి మంటలను అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. స్వల్పంగా గాయపడిన ముగ్గురు ప్రయాణికులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
#Florida 🇺🇸 | Plane with 126 passengers, from the Dominican Republic, caught fire after landing at #Miami airport. The MD-82 plane, Red Air Flight 203, had landed when the landing gear collapsed and caught fire. 3 people with minor injuries. pic.twitter.com/eBok7Xuwhj
— The informant (@theinformantofc) June 22, 2022
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానంలోని ప్రయాణికులు ప్రమాద సమయంలో గజగజ వణికిపోయారని ఎన్‌బీసీ-6 అధికారి ర్యాన్ నెల్సన్ పేర్కొన్నారు. మెక్‌డొనెల్ డగ్లస్ MD-82 విమానానికి ప్రమాదం జరిగిన ఘటనా ప్రాంతానికి పరిశోధకుల బృందాన్ని పంపనున్నారు. విమానంలో మంటలు చెలరేగడానికి గల కారణాలపై విశ్లేషించనున్నారు. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ప్రకారం.. ఫ్రంట్ ల్యాండింగ్ గేర్ కూలిపోవడమే మంటలకు కారణమని భావిస్తోంది. విమానం ప్రమాద ఘటన కారణంగా అదే ఎయిర్ పోర్టుకు చేరుకోవాల్సిన మరి కొన్ని విమానాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Read Also : Karnataka Leader: ప్రిన్సిపాల్‌ను చెంపదెబ్బ కొట్టిన కర్ణాటక లీడర్
1MLA Angada Kanhar : ఏజ్.. జస్ట్ నెంబర్ మాత్రమే.. 58ఏళ్ల వయసులో టెన్త్ పాసైన ఎమ్మెల్యే
2Booster Dose: కొవిడ్ బూస్టర్ డోస్ గ్యాప్‌ను 6నెలలకు తగ్గించిన ప్రభుత్వం
3Diginal India Scam : వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఘరానా మోసం.. రూ.30కోట్లతో జంప్
4Heavy rain: రేపు ఆ ఆరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం..
5Smriti Irani: స్మృతి ఇరానీ, జ్యోతిరాధిత్యాకు అదనపు శాఖలు
6London: బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం.. ప్రధాని బోరిస్‌కు షాకిచ్చిన మరో ఐదుగురు మంత్రులు..
7Pragya Jaiswal: అందాలతో ఫిదా చేస్తున్న ప్రగ్యా జైస్వాల్
8Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్.. మరో ఇద్దరు దక్షిణాది వారికి చోటు
9Telangana Covid Figure : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు
10Nagarjuna: ఎలక్ట్రిఫైయింగ్ అప్డేట్తో వస్తున్న ‘ది ఘోస్ట్’!
-
ICC Test Rankings : టాప్ 10లో చోటు కోల్పోయిన కోహ్లీ.. ఆరేళ్లలో ఇదే ఫస్ట్ టైం..!
-
MacBook Air M2 : అదిరే ఫీచర్లతో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2.. ప్రీ-ఆర్డర్లు ఎప్పుటినుంచంటే?
-
Agent: ఏజెంట్‌ను మళ్లీ వెనక్కి నెడుతున్నారా..?
-
Liger: లైగర్ @ 50 డేస్.. సందడి షురూ చేసిన పూరీ
-
Samsung Galaxy M13 : శాంసంగ్ గెలాక్సీ M13 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Sohail: లక్కీ లక్ష్మణ్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
NBK107: దేశం మారుస్తున్న బాలయ్య.. ఎందుకో తెలుసా?
-
Hangover : హ్యాంగోవర్ ను తగ్గించే తేనె!