Karnataka Leader: ప్రిన్సిపాల్‌ను చెంపదెబ్బ కొట్టిన కర్ణాటక లీడర్

స్పష్టమైన సమాధానం ఇవ్వలేదనే కోపంతో కాలేజ్ ప్రిన్సిపాల్‌ను జనతాదళ్ (సెక్యూలర్) లీడర్ చెంపదెబ్బ కొట్టాడు. ఎమ్. శ్రీనివాస్ అనే లీడర్ రెగ్యూలర్ విజిట్‌లో భాగంగా కాలేజీకి వెళ్లి కంప్యూటర్ ల్యాబ్ లో జరుగుతున్న పనుల గురించి వాకబు చేశాడు.

Karnataka Leader: ప్రిన్సిపాల్‌ను చెంపదెబ్బ కొట్టిన కర్ణాటక లీడర్

Karnataka Leader

Updated On : June 22, 2022 / 1:50 PM IST

Karnataka Leader: స్పష్టమైన సమాధానం ఇవ్వలేదనే కోపంతో కాలేజ్ ప్రిన్సిపాల్‌ను జనతాదళ్ (సెక్యూలర్) లీడర్ చెంపదెబ్బ కొట్టాడు. ఎమ్. శ్రీనివాస్ అనే లీడర్ రెగ్యూలర్ విజిట్‌లో భాగంగా కాలేజీకి వెళ్లి కంప్యూటర్ ల్యాబ్ లో జరుగుతున్న పనుల గురించి వాకబు చేశాడు. వాటిపై సరిగా ప్రిన్సిపాల్ సరిగా రెస్పాన్స్ ఇవ్వలేదని అందరూ చూస్తుండగానే చేయి చేసుకున్నాడు.

మాండ్య ప్రాంతంలో జూన్ 20న జరిగిన ఈ ఘటన వీడియో వైరల్ గా మారింది. నల్వాడి కృష్ణ రాజా వెడియార్ ఐటీఐ కాలేజికి వెళ్లిన మాండ్యకు చెందిన ఎమ్మెల్యే వరుసపెట్టి చెంపదెబ్బలు కొడుతూనే ఉండటం వీడియోల్లో రికార్డ్ అయింది. ఇది జరుగుతున్నంతసేపు ఇతర పొలిటీషియన్లు, అధికారులు, మహిళతో పాటు అంతా షాక్ లో ఘటన చూస్తుండిపోయారు.

Read Also: కర్ణాటకలో వీధికి గాంధీజీని చంపిన ‘గాడ్సే’ పేరు..

దీనిపై పలువురు ట్విటర్‌ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

“నిశ్శబ్దంగా చూస్తున్న ప్రిన్సిపాల్ సహోద్యోగులు.. వారంతా సపోర్ట్‌గా ప్రోగ్రామ్ నుండి బయటకి వెళ్ళిపోలేదా?” అని ఓ నెటిజన్ అడిగారు.

“ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అతని సిబ్బంది, ఇతర కళాశాలల సిబ్బంది మద్దతుగా రావాలి” అని మరొక వ్యక్తి వెల్లడించారు.