Karnataka కర్ణాటకలో వీధికి గాంధీజీని చంపిన ‘గాడ్సే’ పేరు..

కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని బోలా గ్రామంలో ఓ వీధికి నాథూరామ్‌ గాడ్సే పేరు పెట్టారు.

Karnataka కర్ణాటకలో వీధికి గాంధీజీని చంపిన ‘గాడ్సే’ పేరు..

A Street Has Been Named After Nathuram Godse (1)

Updated On : June 7, 2022 / 12:36 PM IST

Karnataka : భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావటంలో కీలక పాత్ర పోషించిన గాంధీని ‘మహాత్మా’అని గౌరవిస్తున్నాం. అటువంటి మహాత్ముడిని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేని ఈనాటికే కాదు ఎప్పటికి ద్వేషిస్తుంటారు భారతీయులు. గాంధీ మీదున్న గౌరవంతో వీధులకు గాంధీ పేరు పెట్టుకుంటుంటారు. కానీ గాంధీజీని చంపిన గాడ్సే పేరును భారతదేశంలో వీధికి పెట్టటానికి ఎవరన్నా పెట్టుకుంటారా? అంటే లేదనే అంటాం. అస్సలు దానికి అంగీకరించం.

కానీ కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని బోలా గ్రామంలో నాథూరామ్‌ గాడ్సే పేరు పెట్టారు కొంతమంది. పెట్టింది ఎవరో తెలీదు గానీ చాలా పడ్బంధీగానే పెట్టారు. నాథూరాం గాడ్సే పేరును ఓ వీధిలో సూచిక బోర్డు పెట్టారు. ఈ ఫొటోలు వైరల్‌ గా మారాయి. దీంతో పోలీసులు పోలీసులు రంగంలోకి దిగారు.

స్థానిక అధికారులు ఈ బోర్డును తొలగించారు. ఈ బోర్డు ఎవరు పెట్టారనేది తెలియలేదు. పంచాయత్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ రాజేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఆ బోర్డును తొలగించారు. ఈ బోర్డు ఎవరు పెట్టారు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీంట్లో భాగంగా ఆబోర్డుని సోమవారం (జూన్ 6.2022) పెట్టారని అధికారుల దృష్టికి వచ్చింది.