మూడేళ్ల బాలికపై 34ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. రేపిస్ట్ చెప్పుల వాసనతో పట్టించిన పోలీసు డాగ్..!

మూడేళ్ల బాలికపై 34ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. రేపిస్ట్ చెప్పుల వాసనతో పట్టించిన పోలీసు డాగ్..!

Updated On : January 5, 2021 / 8:22 PM IST

Police dog tracks down girl’s rapist with scent from slippers : కుక్కలు ఈజీగా వాసనను పసిగట్టగలవు. అదే ట్రైనింగ్ పొందిన పోలీసు డాగ్‌లైతే.. ఏ క్రిమినల్ అయినా తప్పించుకోలేరంతే.. మూడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన 38ఏళ్ల రేపిస్ట్‌ ఆట కట్టించిందో సూపర్ పోలీస్ డాగ్. రేపిస్ట్ చెప్పుల వాసనను పసిగట్టి అతన్ని పోలీసులకు పట్టించింది. థానె మహారాష్ట్రలోని థానెలో తలసారి తాలుకాకు చెందిన మూడేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన రోజువారీ కూలీ అఘాయిత్యం చేశాడు.

తల్లిదండ్రులతో నిద్రపోతున్న చిన్నారిని ఎత్తుకెళ్లి ఆపై అత్యాచారం చేశాడు. చిన్నారిని రేపిస్ట్ ఎత్తుకెళ్తుండగా నిద్రలేచిన తల్లి, భర్తతో పాటు చుట్టపక్కలవారిని అలర్ట్ చేసింది. అప్పటికే నిందితుడు బాలికను ఎత్తుకుని చీకటిలోకి పారిపోయాడు. ఆ తర్వాత చిన్నారి దగ్గరలోని వరిపోలంలో కనిపించింది. వెంటనే తల్లిదండ్రులు బాలికను ఆస్పత్రికి తరలించగా.. అత్యాచారానికి గురైనట్టు వైద్యులు వెల్లడించారు.

అనంతరం పోలీసులు ఘటన స్థలానికి సూపర్ పోలీసు డాగ్ తో చేరుకున్నారు. బాలిక ఉన్న చోటే వదిలేసిన చెప్పుల జతను గుర్తించారు. రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్.. ఆ చెప్పుల వాసన ఆధారంగా నిందితుడి కోసం గాలించి పట్టుకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు మద్యానికి బానిసయ్యాడు.. ఇదివరకే గ్రామంలో ఓ మహిళపై కూడా లైంగిక వేధించాడు. దాంతో అతడి భార్యను వదిలేసింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.