హైదరాబాద్‌లో ఘోరం : ఆస్తి కోసం తల్లిని చంపిన కానిస్టేబుల్

హైదరాబాద్ మాదన్నపేటలోని బోయబస్తీలో దారుణం జరిగింది. ఆస్తి కోసం ఓ కానిస్టేబుల్ బరితెగించాడు. సవతి తల్లిని అతి కిరాతకంగా హత్య చేశాడు. మంగళవారం (ఏప్రిల్ 30,2019)

  • Publish Date - April 30, 2019 / 04:53 AM IST

హైదరాబాద్ మాదన్నపేటలోని బోయబస్తీలో దారుణం జరిగింది. ఆస్తి కోసం ఓ కానిస్టేబుల్ బరితెగించాడు. సవతి తల్లిని అతి కిరాతకంగా హత్య చేశాడు. మంగళవారం (ఏప్రిల్ 30,2019)

హైదరాబాద్ మాదన్నపేటలోని బోయబస్తీలో దారుణం జరిగింది. ఆస్తి కోసం ఓ కానిస్టేబుల్ బరితెగించాడు. సవతి తల్లిని అతి కిరాతకంగా హత్య చేశాడు. మంగళవారం (ఏప్రిల్ 30,2019) ఉదయం సవతి తల్లి సుకన్య ఇంటికి వెళ్లిన కానిస్టేబుల్ శ్రీకాంత్ ఆమె పిల్లల కళ్లలో కారం చల్లాడు. ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న కత్తితో సుకన్యపై దాడి చేశాడు. ఆమె గొంతు కోసి చంపాడు. రెండు నెలల క్రితం శ్రీకాంత్ తండ్రి చనిపోయాడు. అప్పటి నుంచి ఆస్తుల పంపకాలపై గొడవలు జరుగుతున్నాయి. సుకన్యకు ఇచ్చిన ఆస్తి కూడా తనకే ఇవ్వాలని తండ్రి అంత్యక్రియల సమయంలోనే శ్రీకాంత్ గొడవకు దిగాడు. ఇప్పుడు ఏకంగా మర్డర్ చేశాడు. హత్య చేసిన తర్వాత శ్రీకాంత్ పారిపోయాడు.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న శ్రీకాంత్ కోసం గాలిస్తున్నారు. శ్రీకాంత్ తండ్రి యాదయ్య అనారోగ్యంతో రెండు నెలల క్రితం చనిపోయాడు. యాదయ్యకు ఇద్దరు భార్యలు. శ్రీకాంత్… పెద్ద భార్య కొడుకు. బీహెచ్ఈఎల్ టౌన్ షిప్ లో కోటి రూపాయల విలువు చేసే ఇంటితో పాటు మరో ఇంటిని యాదయ్య కొడుకు శ్రీకాంత్ కి ఇచ్చాడు. ఆస్తిలో కొంత భాగాన్ని యాదయ్య తన రెండో భార్యకి కూడా ఇచ్చాడు. అయితే ఆ ఆస్తి కూడా తనకే ఇవ్వాలని శ్రీకాంత్ పట్టుబట్టాడు. ఆస్తి కోసం సుకన్యను చంపేశాడు.