లేఖలో ఏముంది: జగన్ పైదాడి గురించి 24 పేజీల లేఖ రాసుకున్న నిందితుడు

  • Publish Date - January 15, 2019 / 11:26 AM IST

హైదరాబాద్:  ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం కేసు నిందితుడు శ్రీనివాసరావును మంగళవారం NIA అధికారులు విచారిస్తున్నారు. జైల్లో ఉన్న రోజుల్లో అసలు జగన్ పై దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందో అని 24 పేజీల లేఖ రాసుకున్నానని శ్రీనివాసరావు తెలిపాడు.  ఆలేఖను శ్రీనివాసరావును కోర్టుకు తరలించేటప్పుడు జైలు సిబ్బంది తీసుకున్నారని  చెప్పాడు. విచారణలో భాగంగా 4వరోజు ఢిల్లీ నుంచి వచ్చిన NIA అధికారి  శ్రీనివాసరావు ను ప్రశ్నిస్తున్నారు. శ్రీనివాస్ ఆరోగ్యపరిస్ధితి బాగుందని అతని లాయర్ తెలిపారు. శ్రీనివాస రావును విశాఖపట్నం తీసుకువెళ్లట్లేదని 3రోజులు ఇక్కడే విచారిస్తామని NIA అధికారులు చెప్పారు.
మాదాపూర్ లోని NIA కార్యాలయంలో సోమవారం శ్రీనివాస రావును విచారించిన అధికారులు అతని వ్యక్తిగత విషయాలు పై ఆరా తీశారుఎక్కడ చదువుకున్నాడు, అతని స్నేహితుల వివరాలు, ఎక్కెడక్కడ ఉద్యోగాలు చేసిన వివరాలకు సంబంధించి పలు పశ్నలు వేశారు. విచారణ ప్రక్రియ అంతా వీడియో,ఆడియో రికార్డింగ్ చేయించారు. శ్రీనివాసరావు కాల్ డేటాలో 15 మంది మహిళలతో మాట్లాడినట్టు NIA అధికారులు గుర్తించారు.