కృష్ణానదిలో దూకి నవవధువు ఆత్మహత్యాయత్నం చేసుకుంది. వెంటనే ఆమె భర్తకు కూడా నదిలోకి దూకేశాడు.
కృష్ణానదిలో దూకి నవవధువు ఆత్మహత్యాయత్నం చేసుకుంది. వెంటనే ఆమె భర్తకు కూడా నదిలోకి దూకేశాడు. ఈ ఘటన విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. ఎన్ డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే నదిలో దూకి యువతితోపాటు భర్తను కూడా కాపాడి బయటకు తీసుకొచ్చారు. యువతి, యువకులు హేమలత, శ్రీకాంత్ లుగా గుర్తించారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
మంగళగిరికి చెందిన శ్రీకాంత్, హేమలత ఇద్దరూ భార్యభార్తలు. సంవత్సరం క్రితం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే ఆదివారం (ఫిబ్రవరి 16, 2020) విజయవాడ దుర్గ గుడికి వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఇరువురి మధ్య కొంత వివాదం చోటుచేసుకుంది. ఆగ్రహించిన హేమలత వెంటనే ఇబ్రహీంపట్నంలోని కృష్ణానదిలో దూకింది. వెంటనే ఆమెతోపాటు భర్త కూడా నదిలో దూకేశాడు.
గమనించిన ఎన్ డీఆర్ఎఫ్ బృందాలు ఇద్దరినీ కాపాడి బయటికి తీసుకొచ్చారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారికి ఎలాంటి ప్రాణపాయం లేదని డాక్టర్లు చెప్పారు. అయితే పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. సమస్యను పరిష్కరించుకోవాలి కానీ.. చనిపోవడం తప్పని తెలిపారు.