సిట్ విచారణ : అధికారుల ఆధీనంలోకి తహశీల్దార్ కార్యాలయం

  • Publish Date - November 6, 2019 / 08:31 AM IST

రంగారెడ్డి జిల్లా అబ్లుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయాన్ని సిట్ అధికారులు స్వాధీనంలోకి తీసుకున్నారు. తహశీల్దార్ విజయారెడ్డి ఛాంబర్ ల్ సిట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిందితుడు సురేష్ ఇచ్చిన వాంగ్మూలంతో మరి కొందరిని అధుపులోకి తీసుకుని వారినీ ప్రశ్నించనున్నారు. 

మరోవైపు ఉస్మానియా ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్న సురేష్ ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సురేశ్‌కు ఉస్మానియా ఆసుపత్రిలోని మేల్ బర్నింగ్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు. సురేశ్ శరీరం 65 శాతం కాలింది. 74 గంటలు దాటితే తప్పా ఏమీ చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు. ప్రస్తుతం పోలీసుల సంరక్షణలో సురేశ్ కు చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు అతడికి ఫ్లూయిడ్స్‌ అందిస్తున్నారు.

మరోవైపు తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో రాజకీయ నేతల పేర్లు రావడం కొంత కలకలం రేపింది. తహశీల్దార్‌ను బెదిరించారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం ఉందని మల్ రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలను మంచిరెడ్డి ఖండించారు. బాచారంలోని సర్వే నం.70 నుంచి 101 వరకు ఉన్న 412 ఎకరాల భూముల్లో మల్‌రెడ్డి కుటుంబం కబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. సరైన డాక్యుమెంట్స్ లేకుండానే రైతులను భయభ్రాంతులకు గురిచేసి భూములు లాక్కున్నారని ఆరోపించారు. పాస్‌బుక్స్ లేకపోయినా పహాణీలతోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని.. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరపాల్సిందిగా సీఎస్,డీజీపీలకు లేఖలు రాస్తున్నానని తెలిపారు.