Deadbody In flush tank : పెళ్లి కాకుండానే తల్లి అయిన విషయం బయటపడుతుందని.. పసికందుని చంపి టాయిలెట్ ఫ్లష్‌లో వేసింది

తమిళనాడులో దారుణం జరిగింది. పెళ్లి కాకుండానే తల్లి అయిన విషయం ఎక్కడ బయటపడుతుందోనని ఓ మహిళ కన్నబిడ్డను చంపేసింది. మృతదేహాన్ని టాయిలెట్ ఫ్లష్ లో వేసింది.

Deadbody In Flush Tank

Deadbody In flush tank : తమిళనాడులో దారుణం జరిగింది. పెళ్లి కాకుండానే తల్లి అయిన విషయం ఎక్కడ బయటపడుతుందోనని ఓ మహిళ కన్నబిడ్డను చంపేసింది. మృతదేహాన్ని టాయిలెట్ ఫ్లష్ లో వేసింది. బుదలూరు పట్టణానికి చెందిన చెందిన ప్రియదర్శిని(23)కి ఇంకా పెళ్లి కాలేదు. అయితే, ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం ఉంది. ఈ క్రమంలో తల్లి అయ్యింది. ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

అయితే, పెళ్లి కాకుండానే తల్లి అయిన విషయం బయటపడుతుందని ఆమె భయపడింది. ఆ భయంతో చిన్నారిని చంపేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని తంజావూరు మెడికల్ కాలేజీలోని టాయిలెట్ ఫ్లష్ లో వేసింది.

Girl Students Drugged Molested : స్కూల్‌లో ఘోరం… 17మంది బాలికలకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి

ఈ నెల 4న టాయిలెట్ లోకి నీరు రావడం లేదని సిబ్బంది ఫ్లష్ ట్యాంక్ తెరిచి చూసి షాక్ అయ్యారు. అందులో మృతదేహం ఉంది. సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అది మెడికల్ కాలేజీ ఆస్పత్రే అయినా ఆ ఆస్పత్రిలో అసలు మెటర్నిటీ వార్డు లేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరి ఆ పసికందు మృతదేహం ఎక్కడి నుంచి వచ్చింది? చనిపోయాక అక్కడ వదిలి వెళ్లారా? లేక బతికుండగానే సజీవంగా సమాధి చేశారా? అని అనుమానాలు మొదలయ్యాయి. కేసు విచారణను ముమ్మరం చేయడానికి పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. అందులో అసలు విషయం బయటపడింది.

SI Raghava Reddy Suicide: మద్యంలో విషం కలుపుకుని తాగి ఎస్ఐ రాఘవరెడ్డి ఆత్మహత్య!

చేతిలో పసికందుతో వచ్చిన ఒక యువతి ఖాళీ చేతులతో తిరిగి వెళ్లడం గమనించారు. ఆ యువతిని గాలించి పట్టుకున్నారు. విచారణలో ఆమె చెప్పిన విషయాలు పోలీసులను దిగ్భ్రాంతికి గురి చేశాయి. తమిళనాడులోని బుదలూర్ పట్టణానికి చెందిన ప్రియదర్శిని పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం బయటకు తెలిస్తే తన జీవితం నాశనమవుతుందనే భయంతో ఆ పసిబిడ్డను వదిలించుకున్నానని చెప్పింది. తనకు దగ్గరలోని తంజావూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్లానని, దొంగచాటుగా బాత్ రూమ్ కి వెళ్లి టాయిలెట్ ఫ్లష్ ట్యాంకులో పసిబిడ్డని పెట్టేసి ట్యాంకు మూత మూసేశానని, దీంతో ఆ బిడ్డ ఊపిరాడక చనిపోయిందని చెప్పింది.