SI Raghava Reddy Suicide: మద్యంలో విషం కలుపుకుని తాగి ఎస్ఐ రాఘవరెడ్డి ఆత్మహత్య!

కర్నూలు జిల్లాల్లో విషాదం నెలకొంది. డ్యూటీలో చేరి ఏళ్లు గడుస్తున్న ప్రమోషన్‌ రాలేదన్న ఆవేదనతో ఎస్‌ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నూలులోని వెంకటరమణ కాలనీలో జరిగింది.

SI Raghava Reddy Suicide: మద్యంలో విషం కలుపుకుని తాగి ఎస్ఐ రాఘవరెడ్డి ఆత్మహత్య!

Si Raghava Reddy Commits Suicide After He Consumed Poison With Liquor

SI Raghava Reddy Suicide: కర్నూలు జిల్లాల్లో విషాదం నెలకొంది. డ్యూటీలో చేరి ఏళ్లు గడుస్తున్న ప్రమోషన్‌ రాలేదన్న ఆవేదనతో ఎస్‌ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నూలులోని వెంకటరమణ కాలనీలో జరిగింది. ఒకవైపు కుటుంబ సమస్యలతో ఎస్ఐ రాఘవరెడ్డి మద్యంలో పురుగుల మందు కలుపుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సమాచారం. కొట్టాల సమీపంలోని తన అపార్ట్ మెంటులో మద్యం సేవించిన కొన్ని నిమిషాల్లోనే ఆయన మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. ఎస్ఐ రాఘవరెడ్డి ఆత్మహత్యతో పోలీస్‌ శాఖలో చర్చనీయాంశంగా మారింది. కొన్నేళ్లుగా కర్నూలుకు చెందిన రాఘవ రెడ్డి ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 1991 బ్యాచ్‌కు చెందిన రాఘవ రెడ్డికి ఇప్పటివరకూ ఒక ప్రమోషన్‌ కూడా రాలేదు. తన బ్యాచ్‌కి చెందిన వారంతా డీఎస్పీలుగా పదోన్నది పొందినప్పటికీ తనకు మాత్రం ప్రమోషన్ రాలేదంటూ తీవ్ర మనోవేధనకు గురయ్యాడు.

దీనికి తోడు ఇంట్లో సమస్యలు అతన్ని తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసింది. తన కుమారుడు ఐఐటీ చదివి మంచి ఉద్యోగం చేస్తూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం కూడా ఆయన్ను ఆందోళనకు గురిచేసినట్టు పోలీసు శాఖ వర్గాలు అంటున్నాయి. పోలీసు శాఖలో కూడా కొన్ని కేసుల వ్యవహారం ఆయన్ను కలిచివేస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్న మాట. ఏది ఏమైనా ఎస్ఐ రాఘవరెడ్డి ఆత్మహత్యకు గల అసలు కారణాలు ఏంటి అనేది తెలియరాలేదు. ఆత్మహత్యకు సంబంధించి వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. పోస్టుమార్టం నిమిత్తం ఎస్ఐ రాఘవరెడ్డి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాఘవరెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Read Also : Omicron Third Wave : ఒమిక్రాన్ కారణంగా భారత్‌లో భారీ ఎత్తున థర్డ్ వేవ్ వచ్చే అవకాశం.. IMA వార్నింగ్