Omicron Third Wave : ఒమిక్రాన్ కారణంగా భారత్‌లో భారీ ఎత్తున థర్డ్ వేవ్ వచ్చే అవకాశం.. IMA వార్నింగ్

ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దేశంలో భారీ స్థాయిలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు..

Omicron Third Wave : ఒమిక్రాన్ కారణంగా భారత్‌లో భారీ ఎత్తున థర్డ్ వేవ్ వచ్చే అవకాశం.. IMA వార్నింగ్

Omicron Third Wave

Omicron Third Wave : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. క్రమంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. మన దేశంలోనూ ఒమిక్రాన్ కలకలం మొదలైంది. క్రమంగా కొత్త వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముందు ముందు ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత మరింతగా ఉండొచ్చనే నిపుణుల హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తోంది.

కాగా, ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా మన దేశంలో భారీ స్థాయిలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ అదనపు డోసును వేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇదే సమయంలో 12 నుంచి 18 ఏళ్లలోపు వారికి కూడా వ్యాక్సిన్ వేయాలని కోరింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దేశంలోని కీలక రాష్ట్రాల్లో నమోదయ్యాయని.. ఇప్పటికే ఈ కేసుల సంఖ్య రెండంకెలకు చేరుకుందని చెప్పింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య భారీగా పెరుగుతుందని తెలిపింది.

LPG Cylinder : వంట గ్యాస్ సిలిండర్ బరువు భారీగా తగ్గింపు..? కేంద్రం కీలక ప్రతిపాదన

దేశంలో ఇప్పటికే 1.26 బిలియన్ డోసుల వ్యాక్సిన్లను వేశారని… మొత్తం దేశ జనాభాలో 50 శాతానికి పైగా ప్రజలు కనీసం ఒక డోసు వ్యాక్సిన్ వేయించుకున్నారని ఐఎంఏ తెలిపింది. వ్యాక్సిన్ వల్ల కరోనా ఇన్ఫెక్షన్ ను నిలువరించవచ్చనే విషయం ఇప్పటికే రుజువైందని చెప్పింది.

ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై మనం పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే ఒమిక్రాన్ ప్రభావాన్ని కూడా ఎదుర్కోవచ్చని తెలిపింది. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ ను వేయించుకోవాలని కోరింది. ఇప్పటివరకు వ్యాక్సిన్ వేయించుకోని వారిపై ఫోకస్ పెట్టాలని, వారు టీకా వేయించుకునేలా చూడాలని తెలిపింది.

ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ సిబ్బందికి మూడో డోసు వ్యాక్సిన్ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది మెడికల్ అసోసియేషన్. వీరితో పాటు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి కూడా బూస్టర్(అదనపు) డోస్ ఇవ్వాలంది. ఒమిక్రాన్ వల్ల ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉండదని… కానీ, డెల్టా వేరియంట్ కంటే 5 నుంచి 10 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పింది.

WhatsApp Trick : ఈ ట్రిక్ తెలిస్తే.. మీ వాట్సాప్​లో 256 కాంటాక్టులకు ఒకేసారి మెసేజ్​ పంపొచ్చు..!

ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే, ట్రావెల్ బ్యాన్ విధించాలని తాము సూచించడం లేదంది. అదే సమయంలో అనవసరమైన ప్రయాణాలు పెట్టుకోవద్దని, పెద్ద సంఖ్యలో గుమికూడటం చేయవద్దని చెప్పింది. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ లో కోవిడ్ ప్రొటోకాల్ ను కచ్చితంగా పాటించాలంది.

కరోనా మహమ్మారి వెలుగు చూసి.. దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. ఈ రెండేళ్ల కాలంలో అనేక కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేశాయి. నిన్నమొన్నటి దాకా అత్యంత ప్రమాదకారిగా డెల్టా వేరియంట్‌ వణికించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్‌ ను తలదన్నే.. ఒమిక్రాన్‌ అనే మరో వేరియంట్‌ బెంబేలెత్తిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టి… సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో… కొత్త వేరియంట్ భయబ్రాంతులకు గురి చేస్తోంది.

గతంలో వచ్చిన వేరియంట్ల కంటే ఇది చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అనేక దేశాలు మళ్లీ ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోయాయి. చాలా దేశాలు ఇప్పటికే విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.