LPG Cylinder : వంట గ్యాస్ సిలిండర్ బరువు భారీగా తగ్గింపు..? కేంద్రం కీలక ప్రతిపాదన

వంట గ్యాస్ సిలిండర్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందా? సిలిండబర్ బరువు భారీగా తగ్గించనుందా? అంటే, అవుననే సమాధానం వస్తోంది. 14.2 కేజీల బరువుతన్న డొమెస్టిక్ సిలిండర్ ను..

LPG Cylinder : వంట గ్యాస్ సిలిండర్ బరువు భారీగా తగ్గింపు..? కేంద్రం కీలక ప్రతిపాదన

Lpg Cylinder Weight

LPG Cylinder : వంట గ్యాస్ సిలిండర్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందా? సిలిండబర్ బరువు భారీగా తగ్గించనుందా? అంటే, అవుననే సమాధానం వస్తోంది. 14.2 కేజీల బరువుతన్న డొమెస్టిక్ సిలిండర్ ను 5 కేజీలకు తగ్గించడం లేదా ఇతర ఆప్షన్లను పరిశీలిస్తున్నామని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ రాజ్యసభలో తెలిపారు. ప్రస్తుతం 14.2 కేజీలున్న సిలిండర్ ను ఎత్తడం, ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడం ఇబ్బంది అవుతోందని.. దీనికి త్వరలో పరిష్కారం చూపుతామని ఆయన అన్నారు.

Omicron Tension : శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ టెన్షన్..దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్

”గృహ అవసరాల కోసం వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ అంశంలో ఓ కీలక ప్రతిపాదన కేంద్రం దగ్గర ఉంది. ప్రస్తుతం 14.2 కిలోల బరువున్న గ్యాస్ సిలిండర్లను రవాణా చేయడంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్నాం. మహిళలు గ్యాస్ సిలిండర్ బరువును మోయలేక ఇబ్బంది పడుతున్న విషయం కేంద్రం దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో దాని బరువును తగ్గించే ఆలోచనలో కేంద్రం ఉంది”.. అని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ రాజ్యసభలో తెలిపారు.

సిలిండర్ బరువుగా ఉండడంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారని ఓ సభ్యుడు రాజ్యసభలో ప్రస్తావించారు. దీనిపై సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి.. సిలిండర్ బరువు తగ్గించే అంశంపై కీలక ప్రకటన చేశారు.

Lose Weight : తక్కువ తినండి…ఎక్కవగా కదలండి..బరువు తగ్గాలనుకునే వారు…

బరువు సంగతి అటుంచితే వంట గ్యాస్ ధర మాత్రం భారీగా పెరిగింది. ధర రోజురోజుకి పెరుగుతూనే ఉంది. మరోవైపు సబ్సిడీ మొత్తాన్ని కూడా కేంద్రం భారీగా తగ్గించేసింది. అంతేకాదు, త్వరలోనే సబ్సిడీపైనా కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.