Tamil Nadu: పొదల్లో శిశువు మృతదేహం.. స్కూల్లోనే ప్రసవించి, వదిలేసిన బాలిక
తమిళనాడులో దారుణం జరిగింది. పదకొండో తరగతి చదువుతున్న బాలిక స్కూల్లోనే ప్రసవించింది. తర్వాత చిన్నారిని స్కూలు పక్కనున్న పొదల్లో దాచేసి వెళ్లిపోయింది. అయితే, ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
- Narender Thiru
- Published On : September 5, 2022 / 10:18 AM IST
Tamil Nadu: తమిళనాడులో దారుణం జరిగింది. పదకొండో తరగతి చదువుతున్న బాలిక స్కూల్లోనే ప్రసవించింది. తర్వాత శిశువును స్కూలు పక్కనే ఉన్న పొదల్లో దాచేసింది. అయితే, ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడలూరు జిల్లా, భువనగిరిలోని పాఠశాల సమీపంలో ఉన్న పొదల్లో ఒక చిన్నారి మృతదేహాన్ని కొందరు విద్యార్థులు గుర్తించారు.
Nitish Kumar: బీజేపీ సీట్ల గురించి నేనెప్పుడు మాట్లాడాను.. మాట మార్చిన నితీష్
ఈ విషయాన్ని పాఠశాల నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిన్నారికి పేగుతాడు కూడా సరిగ్గా తెంచలేదని గుర్తించారు. వారి ప్రాథమిక అంచనా ప్రకారం స్కూలు ఆవరణలోనే ఆ శిశువు ప్రసవించినట్లు గుర్తించారు. వెంటనే స్కూల్లోని విద్యార్థుల్ని ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపడింది. పదకొండో తరగతి చదువుతున్న ఒక బాలిక ఆ బిడ్డకు జన్మనిచ్చినట్లు గుర్తించారు. పోలీసులు ఆ బాలికను విచారించారు. తాను స్కూల్ బాత్‌రూమ్‌లో బిడ్డను ప్రసవించినట్లు, అనంతరం చిన్నారిని స్కూలు పక్కనున్న పొదల్లో వదిలేసి వెళ్లినట్లు తెలిపింది.
Sheikh Hasina: నేటి నుంచి బంగ్లాదేశ్ ప్రధాని భారత పర్యటన… రేపు మోదీతో భేటీ
వేరే ప్రైవేటు స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న బాలుడి వల్ల గర్భం దాల్చినట్లు ఆమె చెప్పింది. దీంతో ఘటనకు బాధ్యుడైన బాలుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది.
