Sheikh Hasina: నేటి నుంచి బంగ్లాదేశ్ ప్రధాని భారత పర్యటన… రేపు మోదీతో భేటీ

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం నుంచి నాలుగు రోజులపాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును, ప్రధాని మోదీని కలిసి అనేక అంశాలపై చర్చలు జరుపుతారు.

Sheikh Hasina: నేటి నుంచి బంగ్లాదేశ్ ప్రధాని భారత పర్యటన… రేపు మోదీతో భేటీ

Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఈ రోజు (సోమవారం) నుంచి భారత్‌లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 5-8 వరకు ఆమె దేశంలో పర్యటిస్తారు. 2019 తర్వాత షేక్ హసీనా ఇండియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో ప్రధాని మోదీతో మంగళవారం సమావేశమవుతారు.

Viral video: భయానక వీడియో.. కిందికి జారిపడ్డ జెయింట్ స్వింగ్.. 16 మందికి గాయాలు

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలిసే అవకాశం ఉది. షేక్ హసీనా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకునే వివిధ అంశాలపై చర్చిస్తారు. రక్షణ, వ్యాపారం, వాణిజ్యం, నదీ జలాల పంపిణీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. కుషియారా నది జలాల వాటాపై ఒప్పందం కుదుర్చుకుంటారు. అలాగే ఇతర నదుల్లో జలాల పంపిణీపై కూడా ఒప్పందాలు జరుగుతాయి. ఇండియా-బంగ్లాదేశ్.. 54 నదుల్ని పంచుకుంటున్నాయి. అకౌరా-అగర్తాలా రైల్ లింక్‌ను తిరిగి ప్రారంభించే అంశంపై నిర్ణయం తీసుకుంటారు. రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాను షేక్ హసీనా గురువారం సందర్శిస్తారు. ఇక బంగ్లాదేశ్ అభివృద్ధికి భారత్ ఎంతగానో సహకరిస్తోంది.

Nitish Kumar: బీజేపీ సీట్ల గురించి నేనెప్పుడు మాట్లాడాను.. మాట మార్చిన నితీష్

ఆ దేశానికి ఆర్థిక సహాయం అందించడంతోపాటు పలు ప్రాజెక్టులు చేపడుతోంది. మన దేశంలో చదువుకోవడానికి వచ్చే 9,000 మంది బంగ్లాదేశీయులకు మన ప్రభుత్వం స్కాలర్‌షిప్ కూడా అందిస్తోంది. కాగా, షేక్ హసీనా పర్యటనపై భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. ‘‘బంగ్లా ప్రధాని పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాల్ని మరింతగా, బహుముఖంగా బలోపేతం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. రెండు దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాల్ని పెంచుకునేందుకు ఉపయోగపడుతుంది’’ అని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.