Pattabhi Case : రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభి తరలింపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డిపై  అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను మచిలీపట్నం సబ్‌జైలు నుంచి  రాజమండ్రి సెంట్రల్ జైలుకు త

Pattabhi Case :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డిపై  అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను మచిలీపట్నం సబ్‌జైలు నుంచి  రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

ఈ కేసులో  విజయవాడ సూర్యారావు పేట  పోలీసులు….బుధవారం రాత్రి పట్టాభిని అరెస్ట్ చేసి తోట్ల వల్లూరు పోలీసు స్టేషన్ కు తరలించారు. గురువారం ఉదయం అక్కడి నుంచి విజయవాడ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్ర్రేట్ కోర్టులో హజరుపరిచారు. న్యాయమూర్తి పట్టాభికి గురువారం 14 రోజుల పాటు నవంబర్ 2వరకు రిమాండ్ విధించారు.

దీంతో ఆయన్ను మొదట మచిలీపట్నం సబ్‌జైలుకు తరలించారు. అనంతరం శుక్రవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించి  పోలీసు బందోబస్తు మధ్య రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. మరో‌వైపు ఆయన తరుఫు న్యాయవాదులు ఈ రోజు బెయిల్ పిటీషన్ దాఖలు చేయనున్నారు.  పోలీసులు కూడా  పట్టాభిని 5 రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ మరో పిటీషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు