Cambodia Cyber Gang: కాంబోడియా సైబర్ ముఠా గుట్టురట్టు చేసిన టీజీసీఎస్బీ

నకిలీ పత్రాలతో సిమ్ కార్డులను జియో, ఎయిర్‌టెల్ ఏజెంట్లు యాక్టివేట్ చేశారు. ఈ సిమ్ కార్డులను కాంబోడియాలో ఫిషింగ్, ఐడెంటిటీ దొంగతనాలకు వినియోగిస్తున్నారు.

  • Published On : April 2, 2026 / 06:20 AM IST

Cambodia Cyber Gang: కాంబోడియా సైబర్ ముఠా గుట్టురట్టు చేసింది టీజీసీఎస్బీ. కోట్ల రూపాయల సైబర్ మోసాలకు భారతీయ సిమ్ కార్డులు సరఫరా చేస్తున్నారు. ఐదుగురు నిందితులను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అరెస్ట్ చేసింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 198 సిమ్ కార్డులతో అష్రఫ్ అలీ పట్టుబడ్డాడు. 2023 నుంచి ఇప్పటివరకు 600కు పైగా సిమ్ కార్డుల అక్రమ రవాణా చేసినట్లు గుర్తించారు. దుబాయ్‌లో పరిచయం అయిన రిజ్వాన్‌తో కలిసి నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు.

నకిలీ పత్రాలతో సిమ్ కార్డులను జియో, ఎయిర్‌టెల్ ఏజెంట్లు యాక్టివేట్ చేశారు. ఈ సిమ్ కార్డులను కాంబోడియాలో ఫిషింగ్, ఐడెంటిటీ దొంగతనాలకు వినియోగిస్తున్నారు. ఈ కేసులో మరో నిందితుడు అరవింద్ కుమార్ అలియాస్ షాహిద్ పరారీలో ఉన్నాడు. విదేశాల్లో ఉన్న మాస్టర్‌మైండ్ కోసం దర్యాప్తు కొనసాగుతోంది. ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహిత, టెలికమ్యూనికేషన్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. కాగా, ‘సంచార్ సాథి’ వెబ్‌సైట్‌లో తమ పేరుపై ఉన్న సిమ్ కార్డులు చెక్ చేసుకోవాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచించింది.