Son Kills Father: బాబోయ్.. పెళ్లి సంబంధాలు చూడటం లేదని తండ్రిని చంపిన కొడుకు
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Son Kills Father: కొమురంభీం జిల్లా కౌటాల మండల కనికిలో దారుణం జరిగింది. కన్న తండ్రిని కొడుకే చంపేశాడు. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. తనకు పెళ్లి సంబంధాలు చూడడం లేదనే కోపంతో తండ్రిపై దాడి చేశాడు కొడుకు. పెళ్లి సంబంధాలు చూడకపోవడమే కాకుండా వచ్చిన పెళ్లి సంబంధాలను కూడా తండ్రి చెడగొడుతున్నాడని కోపంతో ఊగిపోయాడు కొడుకు. పిడి గుద్దులు గుద్ది తండ్రిని చంపాడు. మృతుడిని లంబాజిగా , నిందితుడిని కుశాబ్ రావుగా పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
