bird collided with plane
Bird Collided With Plane : ఆకాస ఎయిర్‌లైన్స్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆకాశంలో ఆకాస ఎయిర్‌లైన్స్ విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దీంతో విమానాన్ని తిరిగి ముంబైకి మళ్లించారు. ముంబై ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరు బయలుదేరిన ఆకాస ఎయిర్‌లైన్స్‌కు చెందిన (QP-1103) విమానాన్ని ఆకాశంలో పక్షి ఢీకొట్టింది. దీంతో వెంటనే పైలెట్లు విమానాన్ని ముంబైకి మళ్లించగా.. క్షేమంగా ల్యాండింగ్ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం విమానం ఇంజిన్‌లో కాలిపోయిన ఆనవాళ్లను గుర్తించారు.
విమానంలో దుర్వాసన వచ్చిందని, విమానం తిరిగి వచ్చిన తర్వాత ఇంజిన్‌లో పక్షి కాలిపోయినట్లు గుర్తించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. విమానం, ఇంజిన్ లో ఎలాంటి సాంకేతిక లోపం లేదని తెలిపాయి. ఈ సందర్భంగా ఎయిర్‌లైన్ ప్రతినిధి మాట్లాడుతూ ఈ ఘటన ఈ నెల 14న జరిగిందని చెప్పారు.
Smoke In Spicejet Flight : స్పైస్‌జెట్ విమానంలో పొగలు.. తృటిలో తప్పిన ప్రమాదం
విమానం క్యాబిన్‌లో దుర్వాసన రావడంతో విమానాన్ని ముంబైకి మళ్లించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత విమానాన్ని అనువు అనువు తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. తర్వాత సిబ్బంది ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. ప్రయాణికులకు కలిగిన సౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు.