Indian Predator: గ్యాంగ్‌స్టర్‌ను పొడిచి చంపిన 200 మంది మహిళలు.. 2004 నాటి ఘటనను వెలుగులోకి తెచ్చిన ‘నెట్‌ఫ్లిక్స్’

ఈ ఘటనను ఆధారంగా చేసుకుని ‘ఇండియన్ ప్రిడేటర్: మర్డర్ ఇన్ ఏ కోర్టురూమ్’ అనే డాక్యుమెంటరీ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈ సిరీస్‌ను తెరకెక్కించేందుకు ఎంతో కష్టపడ్డారు. కస్తూర్బానగర్‌లోని ఎంతోమందిని కలిసి ఇంటర్వ్యూలు తీసుకున్నారు. అక్కు యాదవ్ మహిళలను ప్రధానంగా దళితులపై అత్యాచారం చేసి ఆపై చంపేసి ఎలా తప్పించుకునేవాడో ఈ సిరీస్‌లో చూపించారు

Indian Predator: అప్పుడెప్పుడో నాగ్‭పూర్‭లో జరిగిన ఒక ఘటన. నాగ్‌పూర్‌లోని కస్తూర్బా నగర్ మురికివాడకు చెందిన దాదాపు 200 మంది మహిళలు గ్యాంగ్‌స్టర్ అక్కు యాదవ్‌ అనే వ్యక్తిని జిల్లా కోర్టు గదిలో 32 ఏళ్ల దారుణంగా పొడిచి చంపారు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ ఘటన.. కాలంతో పాటే కరిగిపోతూ వస్తోంది. అయితే ఈ ఘటన ఆధారంగా నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ఒక వెబ్ సిరీస్ మరోసారి ఈ హత్యా ఉదంతాన్ని గుర్తు చేసింది. గుర్తు చేయడమే కాదు, ఈ హత్యకు సంబంధించి బోల్డన్ని వివరాలను వెల్లడించింది.

అది 2004వ సంవత్సరం. ఆగస్టు 13. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని కస్తూర్బా నగర్ మురికివాడకు చెందిన దాదాపు 200 మంది జిల్లా కోర్టు గదిలో 32 ఏళ్ల గ్యాంగ్‌స్టర్ అక్కు యాదవ్‌ను దారుణంగా పొడిచి చంపారు. రాళ్లు, కత్తులు, కారంపొడితో కోర్టుకు వెళ్లిన మహిళలను చూసి కోర్టు సిబ్బంది పారిపోయారు. గ్యాంగ్‌స్టర్ అక్కు యాదవ్‌ను పట్టుకున్న మహిళలు కత్తితో దాదాపు 70సార్లు కసిదీరా పొడిచి అతడిని హత్య చేశారు. అక్కడితో వారి కోపం చల్లారలేదు. అతడి చెవులు, పురుషాంగాన్ని కోసి పడేశారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. సంచలనం సృష్టించిన ఈ హత్యపై దర్యాప్తు జరిపిన పోలీసులు నేరపూరిత వైరం కారణంగా ఈ హత్య జరిగిందని తేల్చారు.

1990ల నుంచి మరణించే వరకు నాగ్‌పూర్‌లోని కస్తూర్బా నగర్‌ను భయభ్రాంతులకు గురిచేస్తూ గడిపిన అక్కు యాదవ్ అసలు పేరు భరత్ కాళీచరణ్. అతడొక దొంగ, దోపిడీదారు, హంతకుడు. మరీ ముఖ్యంగా రేపిస్ట్. మహిళలను వారి ఇళ్ల నుంచి బయటకు లాగి వారి దాడి, అత్యాచారం చేసేవాడు. తన సహచరులతో కలిసి ఇళ్లలోకి చొరబడి సామూహిక అత్యాచారాలకు పాల్పడేవాడు. చిన్నారులు, గర్భిణులు ఎవరినీ వదిలేవాడు కాదు.

Unstoppable 2: స్నేహితులతో దబిడి దిబిడే అంటోన్న బాలయ్య.. ఆహా.. అదిరిపోయిందంటున్న అభిమానులు!

గ్యాంగ్‌స్టర్ అక్కు యాదవ్ అకృత్యాలపై ఫిర్యాదు చేయడానికి భయపడేవారు. అయితే ఓ మహిళ ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేసింది. దీంతో అక్కు యాదవ్ రెచ్చిపోయాడు. యాసిడ్‌తో ఆమెను బెదిరించాడు. చివరికి మహిళలందరూ ఏకం కావడంతో అక్కు యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగ్‌పూర్ జిల్లా కోర్టులో జరిగే విచారణలో అతడికి బెయిలు వస్తుందని ప్రజలకు తెలిసింది. అంతే, కోర్టు వద్దకు చేరుకుని అతడికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న మహిళలు, కొందరు పురుషులు కలిసి కోర్టు హాలులోనే అక్కును పొడిచి చంపారు. మహిళల ఆగ్రహావేశాలు చూసి పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు.

ఈ ఘటనను ఆధారంగా చేసుకుని ‘ఇండియన్ ప్రిడేటర్: మర్డర్ ఇన్ ఏ కోర్టురూమ్’ అనే డాక్యుమెంటరీ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈ సిరీస్‌ను తెరకెక్కించేందుకు ఎంతో కష్టపడ్డారు. కస్తూర్బానగర్‌లోని ఎంతోమందిని కలిసి ఇంటర్వ్యూలు తీసుకున్నారు. అక్కు యాదవ్ మహిళలను ప్రధానంగా దళితులపై అత్యాచారం చేసి ఆపై చంపేసి ఎలా తప్పించుకునేవాడో ఈ సిరీస్‌లో చూపించారు. ఈ డాక్యుమెంటరీ దర్శకుడు ఉమేశ్ వినాయక్ కులకర్ణి మాట్లాడుతూ.. డాక్యుమెంటరీని తెరకెక్కించడం చాలా సవాలుగా మారిందని అన్నారు.

Stop Using Headphones : అదే పనిగా హెడ్‌ఫోన్లను వాడితే శాశ్వతంగా వినికిడి కోల్పోయినట్టే.. తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. ఈ జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే..!

ట్రెండింగ్ వార్తలు