Unstoppable 2: స్నేహితులతో దబిడి దిబిడే అంటోన్న బాలయ్య.. ఆహా.. అదిరిపోయిందంటున్న అభిమానులు!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్-2’ టాక్ షోకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో మనం చూస్తున్నాం. తొలి ఎపిసోడ్ మొదలుకొని, మూడో ఎపిసోడ్ వరకు, వచ్చిన గెస్టులతో బాలయ్య చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక బాలయ్య వారి పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకునేలా చేసి ఈ టాక్ షోను ఆయన ముందుకు తీసుకెళ్తున్న తీరు అద్భుతమని ఈ టాక్ షో చూసిన వారు అంటున్నారు.

Unstoppable 2: స్నేహితులతో దబిడి దిబిడే అంటోన్న బాలయ్య.. ఆహా.. అదిరిపోయిందంటున్న అభిమానులు!

Balakrishna Unstoppable 2 Latest Episode New Promo

Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్-2’ టాక్ షోకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో మనం చూస్తున్నాం. తొలి ఎపిసోడ్ మొదలుకొని, మూడో ఎపిసోడ్ వరకు, వచ్చిన గెస్టులతో బాలయ్య చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక బాలయ్య వారి పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకునేలా చేసి ఈ టాక్ షోను ఆయన ముందుకు తీసుకెళ్తున్న తీరు అద్భుతమని ఈ టాక్ షో చూసిన వారు అంటున్నారు.

Unstoppable 2: బాలయ్య టాక్ షోకు మరో ఇద్దరు యంగ్ హీరోలు.. ఇక సందడే సందడి!

అయితే తాజాగా ఈ టాక్ షోలోని నెక్ట్స్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఆహా నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఈసారి అన్‌స్టాపబుల్ 2 షోకు గెస్టులుగా బాలకృష్ణ స్నేహితులు వస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ‘బాలయ్య కుటుంబాన్ని చూసిన మీకు, ఇవాళ బాలయ్య స్నేహాన్ని పరిచయం చేయాలనిపించింది..’’ అంటూ బాలయ్య తనకు ఎంతో సన్నిహితులైన స్నేహితులు, ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఏపీ రాష్ట్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ కె.సురేశ్ రెడ్డిలను ఈ ఎపిసోడ్ గెస్టులుగా పిలిచారు. ఇక వారితో తనకున్న స్నేహాన్ని ఈ సందర్భంగా బాలయ్య షేర్ చేసుకున్నాడు.

Unstoppable 2: అందర్నీ నవ్వించిన డీజే టిల్లు.. బాలయ్యను మాత్రం ఏడిపించాడు..

అటు, కిరణ్ కుమార్ రెడ్డి సీఎం కావడానికి గల కారణాలు.. తాను చూసిన రాజకీయాలను ఈ ఎపిసోడ్‌లో వివరించారు. అయితే ఈ సందర్భంగా దివంగత నేత వైయస్. రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన రావడంతో.. ‘వి మిస్ గ్రేట్ పర్సనాలిటీస్, అండ్ గ్రేట్ లీడర్స్.. అలాంటి వారిలో రాజశేఖర్ రెడ్డి ఒకరు’ అంటూ ఆయన గురించి బాలయ్య చెప్పుకొచ్చారు. ఇక ఈ క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డితో బాలయ్య క్రికెట్ ఆడుతుండగా.. ఈ మధ్యలో సీనియర్ హీరోయిన్, నటి రాధిక కూడా ఎంట్రీ ఇచ్చింది. రాధికతో బాలయ్య చేసిన అల్లరికి సంబంధించి శాంపిల్ మాత్రమే మనకు ఈ ప్రోమోలో చూపించారు. పూర్తి ఎంటర్టైన్మెంట్ కోసం ఈ ఎపిసోడ్‌ను నవంబర్ 25న చూడాల్సిందే అని ఆహా పేర్కొంది.