UP Crime: ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. తన తండ్రితో గొడవపడిన ఓ యువకుడు.. భార్యతో కలిసి మృత్యువును కౌగిలించుకున్నాడు. రోమాలు నిక్కబొడుచుకునే విధంగా ఆత్మహత్యను ఎంచుకున్నాడు. భార్యను కారులో కూర్చోబెట్టుకుని దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో కారును గంగా నదిలోకి పోనిచ్చాడు. పోలీసులు, పీఏసీ బృందాలు గంటల పాటు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ తర్వాత సంఘటనా స్థలానికి 10 కిలోమీటర్ల దూరంలో ఇద్దరి మృతదేహాలు లభించాయి.
సమాచారం ప్రకారం, ఈ విషయం గజ్రౌలా కొత్వాలి ప్రాంతానికి చెందిన సిక్రి ఖాదర్ గ్రామానికి సంబంధించినది. ఇక్కడ షేన్ ఆలం తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతడికి ఐదు నెలల క్రితమే నాజియాతో వివాహమైంది. నజియా నాలుగు నెలల గర్భిణి. షేన్ ఆలంకు ఆరుగురు తోబుట్టువులు. అతడు అందరికంటే పెద్దవాడు. డబ్బు విషయంలో షేన్‌కి తన తండ్రితో గురువారం గొడవ జరిగినట్లు విచారణలో తేలింది. దీని తర్వాత షేన్ తన భార్య నజియాను కారు ఎక్కించుకుని ఆత్మహత్యకు పూనుకున్నాడు.
Bandi Sanjay Fires on CM KCR : నటనలో కేసీఆర్ను మించిన వారు లేరంటూ మండిపడ్డ బండి సంజయ్
కారు తీసి తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లను ఢీ కొట్టాడు. అనంతరం కారును దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో నడిపి గంగానదిలోకి పోనిచ్చాడు. ఈ ఘటనను చూసిన చుట్టుపక్కల వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న ఎస్డీఎం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, పీఏసీ డైవర్లు అన్వేషణ ప్రారంభించారు.
చాలా గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ తర్వాత, ఇద్దరి మృతదేహాలను సంఘటనా స్థలానికి 10 కిలోమీటర్ల దూరంలో స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే, కారు గురించి ఇంకా ఎలాంటి క్లూ లభించలేదు. ఈ సమయంలో గంగానది ప్రవాహం చాలా వేగంగా ఉంటుందని చెప్పారు. ప్రమాదంలో షేన్ ఆలం తండ్రి పరిస్థితి కూడా విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.