లలితా జ్యూయలర్స్ లో చోరీ జరిగింది. హైదరాబాద్ పంజాగుట్టలోని లలితా జ్యూయలరీ షోరూంలో సేల్స్ మెన్ దృష్టి మరల్చి 92 గ్రాములు బంగారు ఆభరణాలను కొందరు కస్టమర్లు దోచుకు వెళ్లినట్లు గుర్తించారు.
“డబ్బులు ఎవరికీ ఊరికే రావు… మీ కష్టార్జితం వృధా చేయకండి” అంటూ వినియోగ దారులను ఆకట్టుకుని దక్షిణాది రాష్ట్రాల్లో బంగారం వ్యాపారం చేస్తున్న లలితా జ్యూయలర్స్ లో చోరీ జరిగింది. హైదరాబాద్ పంజాగుట్టలోని లలితా జ్యూయలరీ షోరూంలో సేల్స్ మెన్ దృష్టి మరల్చి 92 గ్రాములు బంగారు ఆభరణాలను కొందరు కస్టమర్లు దోచుకు వెళ్లినట్లు గుర్తించారు. సంస్ధ మేనేజర్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జనవరి 15వతేదీ సంక్రాంతి పండుగ రోజు సాయంత్రం4గంటల సమయంలో గుంపుగా వచ్చిన కొందరు కస్టమర్లు కౌంటర్లో ఉన్న సేల్స్ మెన్ దృష్టి మరల్చి సుమారు. రూ. 3.5 లక్షల విలువైన 2 బంగారు గొలుసులు. ఒక బ్రాస్ లెట్ చోరీ చేశారు. సంస్ధలో నిర్వహించిన ఆడిట్ లో ఈ విషయం బయట పడింది. దీంతో వెంటనే సీసీ కెమెరా పుటేజీని పరిశీలించగా గుంపుగా వచ్చిన వారిలో ఎవరో దొంగిలించినట్లు గుర్తించారు.