Robbery In Warangal
Warangal : వరంగల్ లో నిన్నరాత్రి దారి దోపిడీ జరిగింది. సినిమా ఫక్కీలో దారి కాచిన దుండగులు వ్యాపారి కళ్లలో కారం కొట్టి అతని వద్ద ఉన్న రూ. 7లక్షలు ఎత్తుకెళ్లారు.
వరంగల్ లో ఐరన్&హార్డ్ వేర్ వ్యాపారం చేసే కనకయ్య రోజూ మాదిరిగానే నిన్న రాత్రి 9 గంటల సమయంలో షాపు కట్టేసి….షాపులో ఉన్న నగదు తీసుకుని బ్యాంక్ కాలనీలోని తన ఇంటికి బయలుదేరాడు. ముగ్గురు దుండుగుల అతడ్ని అనుసరించారు.
బ్యాంకు కాలనీలోకి రాగానే నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో కనకయ్యను అడ్డగించి… అతని కళ్లలో కారంకొట్టి చేతిలోని రూ.7 లక్షలు ఉన్న నగదు బ్యాగ్ లాక్కోని బైక్ పై పారిపోయారు. వెంటనే కనకయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.