Theft In Police Officers Apartement : పోలీసాఫీసర్లు ఉండే అపార్ట్‌మెంట్ లోనే చోరీ

వరంగల్ జిల్లాలో దొంగలు చాలా ధైర్యవంతులులాగా ఉన్నారు. ఇద్దరు ఏసీపీలు, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్సైలు నివాసముండే అపార్ట్‌మెంట్‌లోనే తమ చేతివాటం ప్రదర్శించి విలువనై బంగారం ఎత్తుకెళ్లా

Theft In Police Officers Apartement :  వరంగల్ జిల్లాలో దొంగలు చాలా ధైర్యవంతులులాగా ఉన్నారు. ఇద్దరు ఏసీపీలు, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్సైలు నివాసముండే అపార్ట్‌మెంట్‌లోనే తమ చేతివాటం ప్రదర్శించి విలువనై బంగారం ఎత్తుకెళ్లారు. ధనవంతులు, వ్యాపారస్తులు, ఉద్యోగులుండే ప్రాంతంలో ….చుట్టూ సీసీ కెమెరాలున్నా చాకచక్యంగా దొంగలు లోపలికి చొరబడి బంగారు నగలను మాత్రమే చోరీ చేసి వెండి నగలతోపాటు నగదును చిందరవందరగా పడేసి వెళ్లారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట‌లోని  61వ డివిజన్‌ వడ్డెపల్లి ట్యాంక్‌బండ్‌ ప్రాంతంలోని పీజీఆర్‌ అపార్ట్‌మెంట్‌లో జరిగింది.

పీజీఆర్ అపార్ట్ మెంట్లో దాదాపు 60  కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరిలో ఇద్దరు ఏసీపీలు, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్సైలు కూడా ఉన్నారు. అపార్ట్ మెంట్ లోని 202 ఫ్లాట్ లో ఉండే నిట్ రిటైర్డ్ ప్రోఫెసర్ ఆర్వీ చలం, 203 లో ఉండే వెలిచర్ల రవికుమార్, 102 ప్లాట్ లో ఉండే మనీష్ కుమార్ ఇళ్లకు  తాళాలు వేసి బంధు మిత్రుల ఇళ్ళకు వెళ్లారు. ఇది గమనించిన దొంగలు ఆదివారం రాత్రి వడ్డెపల్లి రిజర్వాయర్‌ ట్యాంక్‌బండ్‌  పైభాగం నుంచి ఫెన్సింగ్‌ కట్‌ చేసి లోపలికి దిగి వాచ్‌మెన్‌ గంగారపు కొమురయ్య ఇంటికి బయటి నుంచి గొళ్లెం పెట్టి అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించారు.
Also Read : Wife Kidnapped Her Husband : విడాకులు కోసం ప్రియుడితో కలిసి భర్తను కిడ్నాప్ చేసిన భార్య

మూడు ఫ్లాట్లకు ఉన్న తాళాలను పగులగొట్టి వారి ఇళ్లలోని బీరువాల్లోఉన్న దాదాపు 190 తులాల బంగారు నగలను దొచుకెళ్ళారు. సోమవారంరాత్రి తమ ఇళ్లలో దొంగతనం జరిగినట్లుగా సమాచారం తెలుసుకున్న చలం ఇంటికి వచ్చి చూడగా తమ పక్క ఫ్లాట్లలోనూ దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఈ మేరకు బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు