Madhya Pradesh: తాటి కల్లు తాగి ముగ్గురు మృతి, నలుగురి పరిస్థితి విషమం

కల్లు తాగిన ఇతరులను ధార్, బోరి పట్టణాల్లోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో 45 ఏళ్ల మహిళ, 55 ఏళ్ల వ్యక్తి ఆదివారం రాత్రి వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారి తెలిపారు. కల్లు సేవించిన మరో 13 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని, వారందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారని తెలిపారు.

Palm wine

Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కల్లు తాగి ముగ్గురు మరణించారు. అంతే కాకుండా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందట. సాధారణంగా కల్లు ఆరోగ్యానికి మంచిదనే చెప్తారు. ఇది కొంత వరకు నిజమే అయినప్పటికీ.. తాజా ఘటనలో తాగిన కల్లులో విషం కలిసిందట. అందుకే వారు మృత్యువు వరకు వెళ్లారు. ధార్ జిల్లాలోని తండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రాబల్య ప్రాంతమైన జడమ్‌లి గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

Guddu Muslim: ఉమేశ్ పాల్ హత్య కేసులో మరో కీలక వ్యక్తి, అతిక్ అహ్మద్ అనుచరుడు గుడ్డు ముస్లిం లొకేషన్ దొరికిందట!

కల్లు తాగిన స్థలంలో క్రిమిసంహారక బాటిల్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. అయితే అది కల్లులో కలిపారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదని, ఈ సంఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ధార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, ఒక కుటుంబంలోని సభ్యులు తమ వ్యవసాయ క్షేత్రంలోని చెట్టు నుంచి తీసిన కల్లు సేవించారని, ఆ వెంటనే ఒకరు మరణించారని చెప్పారు.

Politics in India: కేంద్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా ఆ నలుగురు.. అంతుచిక్కని రాజకీయం

నస్రు (46) అనే వ్యక్తి మరణించినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం మధ్యాహ్నం గ్రామానికి చేరుకుని, కల్లు తాగిన ఇతరులను ధార్, బోరి పట్టణాల్లోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో 45 ఏళ్ల మహిళ, 55 ఏళ్ల వ్యక్తి ఆదివారం రాత్రి వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారి తెలిపారు. కల్లు సేవించిన మరో 13 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని, వారందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారని తెలిపారు.

Minister Sidiri Appalaraju : చంద్రబాబు, బీఆర్ఎస్ దగ్గర ప్యాకేజీ తీసుకుంటున్న పవన్ కల్యాణ్ : మంత్రి సీదిరి అప్పలరాజు

వీరిలో నలుగురు ధార్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారి తెలిపారు. ఈ ఘటనపై తదుపరి విచారణ, ఫోరెన్సిక్ విచారణ, పోస్టుమార్టం నివేదిక తర్వాత ఈ వాస్తవాలన్నీ తేటతెల్లమవుతాయని ఆయన చెప్పారు. అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతున్నట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు.