Guddu Muslim: ఉమేశ్ పాల్ హత్య కేసులో మరో కీలక వ్యక్తి, అతిక్ అహ్మద్ అనుచరుడు గుడ్డు ముస్లిం లొకేషన్ దొరికిందట!

గుడ్డు ముస్లిం నాటు బాంబుల తయారీలో నైపుణ్యం ఉన్నావాడు. ఇతడికి బుల్లెట్లు కాల్చడం కంటే బాంబులు విసరడం మహా సరదానట. అతడు చేసే నేరాలు కూడా అలాగే ఉంటాయి.గుడ్డు ధనంజయ్ సింగ్, అభయ్ సింగ్, ముఖ్తార్ అన్సారీ సహా అనేక మంది డాన్‌ల వద్ద పనిచేశాడు.

Guddu Muslim: ఉమేశ్ పాల్ హత్య కేసులో మరో కీలక వ్యక్తి, అతిక్ అహ్మద్ అనుచరుడు గుడ్డు ముస్లిం లొకేషన్ దొరికిందట!

Guddu Muslim

Guddu Muslim: గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ అనుచరుడు అయిన గుడ్డు ముస్లిం చివరి లొకేషన్ కర్ణాటకలో ఉందని పోలీసులు సోమవారం తెలిపారు. ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులలో గుడ్డు ముస్లిం ఒకడు. అంతే కాకుండా ఈ కేసులో ప్రాణాలతో ఉన్న కీలక నిందితుల్లో ఇతడు ఒకడు. ఉమేష్ పాల్ హత్య జరిగిన ఫిబ్రవరి 24 నుండి పరారీలో ఉన్నాడు. 2005లో బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్యకేసులో ఉమేష్ పాల్ కీలక సాక్షి. కాగా, శనివారం పోలీసులు, మీడియా ఎదుటే దుండగుల కాల్పుల్లో చనిపోయిన అతిక్ అహ్మద్ రెండు హత్యల్లోనూ నిందితుడిగా ఉన్నాడు. ఉమేష్ పాల్ హత్యకు గురైన ఒక రోజు తర్వాత ఫిబ్రవరి 25న ప్రయాగ్‌రాజ్‌లోని ధూమ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో పేరు నమోదైన 10 మందిలో గుడ్డూ ముస్లిం కూడా ఉన్నాడు.

Same-Sex Marriage: స్వలింగ వివాహంపై మళ్లీ అదే మాట.. సుప్రీం ముందు ఇస్లాం మతాన్ని కూడా ప్రస్తావించిన కేంద్రం

ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వారిలో ఇప్పటికే ఆరుగురు మరణించారు. ప్రయాగ్‌రాజ్‌లోని అతని నివాసం వెలుపల ఉమేష్ పాల్, అతనికి భద్రతగా ఉన్న ఇద్దరు పోలీసులపై దాడి చేసిన సమయంలో గుడ్డు ముస్లిం నాటు బాంబులను విసిరినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉమేష్ పాల్ సహా ఇద్దరు పోలీసులను కాల్చి చంపినప్పటి నుంచి గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, అతనితో సంబంధం ఉన్న మరో ఐదుగురు రెండు నెలల లోపే హత్యకు గురయ్యారు. ఉమేష్ పాల్ హత్య ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న 10 మందిలో మొత్తం ఆరుగురు హతమయ్యారు. అతిక్ అహ్మద్ కుమారుడు అసద్, అతని సోదరుడు అష్రఫ్, సహచరులు అర్బాజ్, విజయ్ చౌదరి అలియాస్ ఉస్మాన్, గులాం హసన్.. వీరంతా ఉమేష్ పాల్ హత్యతో సంబంధం ఉన్నవారే.

Punjab: స్వర్ణ దేవాలయం ఇండియాలో లేదట, పంజాబ్‭లో ఉందట.. త్రివర్ణ పతాకం ఉందని లోపలికి అనుమతించలేదు

అతీక్ అహ్మద్ తమ్ముడు ఖలీద్ అజీమ్‌ని అలహాబాద్ (పశ్చిమ) అసెంబ్లీ స్థానం నుంచి రాజు పాల్ ఓడించాడు. ఇది జరిగిన నెలల వ్యవధిలోనే రాజు పాల్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇక ఉమేష్ పాల్ హత్య కేసులో మొదటి ఎన్‌కౌంటర్ ఫిబ్రవరి 27 న ప్రయాగ్‌రాజ్‌లో జరిగింది. ఈ ఎన్‭కౌంటర్లో కారు నడిపిన అర్బాన్ హతమయ్యాడు. అనంతరం మార్చి 6న మళ్లీ ప్రయాగ్‌రాజ్‌లో విజయ్ అలియాస్ ఉస్మాన్ మీద ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఇద్దరు ఉమేష్ పాల్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఏప్రిల్ 13న ఝాన్సీలో జరిగిన ఎదురుకాల్పుల్లో అసద్, గులాంలను పోలీసులు కాల్చి చంపారు.

Tamil Nadu: చూసుకుందాం అంటే చూసుకుందాం.. సీఎం స్టాలిన్‭కు తమిళనాడు బీజేపీ చీఫ్ సవాల్

గుడ్డు ముస్లిం, అర్మాన్, సబీర్‭లు అతిక్ సహాయకులు. వీరంతా పరారీలో ఉన్నారు. వారి తలలపై రూ. 5 లక్షల రివార్డు కూడా ఉంది. అతిక్ భార్య షయిస్తా పర్వీన్ కూడా పరారీలో ఉంది. చివరిగా శనివారం అర్థరాత్రి ఉత్తరప్రదేశ్ పోలీసుల అదుపులో ఉన్న అతిక్, అష్రఫ్‌లు కాల్చి చంపబడ్డారు. గుడ్డు ముస్లిం నాటు బాంబుల తయారీలో నైపుణ్యం ఉన్నావాడు. ఇతడికి బుల్లెట్లు కాల్చడం కంటే బాంబులు విసరడం మహా సరదానట. అతడు చేసే నేరాలు కూడా అలాగే ఉంటాయి.గుడ్డు ధనంజయ్ సింగ్, అభయ్ సింగ్, ముఖ్తార్ అన్సారీ సహా అనేక మంది డాన్‌ల వద్ద పనిచేశాడు. అతను గత 10 సంవత్సరాలుగా అతిక్ అహ్మద్ వద్ద పనిచేస్తున్నాడు. లక్నోలోని ప్రసిద్ధ పీటర్ గోమ్స్ హత్య కేసులో అతని పేరు కూడా ఉంది. గతంలో లక్నోలోని పోలీస్ స్టేషన్ సమీపంలో బాంబు దాడి కేసులో అరెస్టయ్యాడు.