కిక్కు కోసం మందుబాబులు తెగిస్తున్నారు. ఒక్క క్వార్టర్ ఇవ్వండి అంటూ బతిమిలాడుకుంటున్నారు. జనతా కర్ఫ్యూ తర్వాత అమాంతం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించడంతో అన్నీ బంద్ అయిపోయాయి. చుక్క మందు లేకపోవడంతో మందుబాబులు పిచ్చెక్కిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో కొంతమంది మానసికంగా కృంగిపోయారు. వీరంతా ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి క్యూ కడుతున్నారు. మరికొంతమంది సూసైడ్ చేసుకున్నారు. తాజాగా తమిళనాడులో దురదృష్టర ఘటన చోటు చేసుకుంది. (వాట్సప్‌లోనే స్కూల్ పాఠాలు)
పుదుకొట్టాయ్ జిల్లాలోని చెంగల్ పట్టు ప్రాంతంలో కూల్ డ్రింకులో షేవింగ్ లోషన్ కలుపుకుని త్రాగారు. అపస్మారకస్థితికి చేరుకోవడంతో వీరిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన 2020, ఏప్రిల్ 05వ తేదీ ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. చికిత్స పొందుతూ వీరు కన్నుమూశారు. దీంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కూల్ డ్రింక్ లో షేవింగ్ లోషన్..కలుపుకుని తాగితే..కిక్కు ఎక్కుతుందని కొంతమంది చెప్పడంతో ఆ ముగ్గురు అలా చేశారని అంటున్నారు. అందులో కలుపుకుని మద్యం తాగుతున్నట్లుగా ఫీలవుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. భారతదేశంలోకి ప్రవేశిస్తూ..మృత్యుఘంటికలు మ్రోగిస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం. జనజీవనం ఎక్కడికక్కడనే స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. బార్లు, వైన్ షాపులు మూతపడ్డాయి. దీంతో మందు దొరకక అవస్తలు పడుతున్నారు.