Lockup Death Case : అడ్డగుడూరు లాకప్‌డెత్‌ : ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్‌

యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరు లాకప్‌ డెత్‌ కేసులో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ చర్యలు తీసుకున్నారు.

Cops Suspended

Lockup Death Case : యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరు లాకప్‌ డెత్‌ కేసులో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ చర్యలు తీసుకున్నారు. లాకప్ డెత్ కు కారణమైన ఎస్‌ఐ మహేశ్‌, కానిస్టేబుళ్లు రషీద్‌, జానయ్యలపై వేటు వేశారు. ముగ్గురినీ సస్పెండ్ చేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు.

అడ్డగూడురు పోలీసు స్టేషన్‌లో మూడు రోజుల క్రితం మరియమ్మ(45) అనే దళిత మహిళ మరణించింది. విచారణలో ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల నిర్లక్ష్యం కారణంగానే మహిళ మరణించినట్లు ప్రాథమికంగా తేలింది. దీంతో బాధ్యులను సస్పెండ్‌ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. మల్కాజ్‌గిరి ఏసీపీని దర్యాప్తు అధికారిగా సీపీ నియమించారు. లాకప్‌డెత్‌ ఘటనపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.