Three Students Drowned Reservoir
Three Students Drowned Reservoir : నల్లగొండ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో ముగ్గురు ఫార్మసీ విద్యార్థులు గల్లంతయ్యారు. ఈతకు దిగి రిజర్వాయర్‌లో మునిగిపోయారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు ఈజ ఈతగాళ్ల సాయంతో గాలించగా.. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో విద్యార్థి కోసం గాలింపు కొనసాగుతోంది. మృతుల్ని ఆకాశ్, గణేశ్, కృష్ణగా గుర్తించారు.
హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ ఫార్మసీ కాలేజ్‌కి చెందిన 8మంది విద్యార్థులు.. నాగార్జున సాగర్ చూడటానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు వెళ్లారు. ఆకాశ్, గణేశ్, కృష్ణ కలిసి ఈతకు దిగి ప్రాణాలు కోల్పోయారు. రిజర్వాయర్‌లో దొరికిన ఇద్దరి మృతదేహాల్ని పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
Tragedy : తుంగభద్ర ఎల్ఎల్ సీ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి
కొన ప్రాణం ఉందేమో అన్న ఆశతో.. వారిని కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించారు. హార్ట్ పంపింగ్ ట్రీట్‌మెంట్‌తో పాటు నోట్లో గాలి ఊదుతూ స్టూడెంట్స్‌ని రక్షించేందుకు ట్రై చేశారు. కానీ.. అప్పటికే సమయం మించిపోవడంతో ప్రాణాల్ని కాపాడలేకపోయారు. డాక్టర్ల ప్రయత్నాన్ని చూస్తూ ఆస్పత్రిలో ఉన్నవారు కన్నీళ్లు పెట్టుకున్నారు.