Greater Noida: తోటి విద్యార్థిని చెట్టుకు కట్టేసి రాడ్లతో కిరాతకంగా హింసించిన ముగ్గురు విద్యార్థులు

విద్యార్థిని అడవికి తీసుకెళ్లిన శంకర్‌తో పాటు మరో ఇద్దరు యువకులు ఇనుప రాడ్‌లు, బెల్టులతో విద్యార్థిని కొట్టారు. ఇరుగుపొరుగున ఉండే మహిళతో ఎందుకు మాట్లాడుతున్నాడని కొడుతున్న సమయంలో అన్నారట. కొట్టిన దెబ్బలో నిఖిల్ రెండు కాళ్లు, ఒక చేయి విరిగింది, దాని కారణంగా అతను పరీక్షకు హాజరు కాలేకపోయాడు. నిఖిల్ శరీరంలోని చాలా భాగాలకు కూడా గాయాలయ్యాయి.

Three students tied the student to a tree and brutally tortured him with rods

Greater Noida: దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న గ్రేటర్ నోయిడాలో దారుణం వెలుగు చూసింది. గ్రేటర్ నోయిడాలోని గోకుల్ధామ్ కాలనీలో నివసిస్తున్న ఓ ఇంటర్ విద్యార్థిపై భీకరమైన దాడి జరిగింది. ముగ్గురు యువకులు తమ తోటి విద్యార్థిని కిడ్నాప్ చేసి అడవికి తీసుకెళ్లారు. అనంతరం అక్కడ సదరు విద్యార్థిని చెట్టుకు కట్టేసి రాడ్లతో విపరీతంగా కొట్టారు. ఈ దాడిలో విద్యార్థి రెండు కాళ్లు, ఒక చేయి విరిగింది. ఆ విద్యార్థికి తొందరలోనే బోర్డు పరీక్షలు ఉన్నాయి. ఇక ఈ విషయమై స్థానిక సూరజ్‌పూర్ పోలీస్ స్టేషనులో కేసు నమోదు అయింది.

Nagaland polls: ఎన్నికల సిబ్బందితో వస్తున్న బస్సు బోల్తా.. ఒకరు మృతి, 13 మందికి గాయాలు

సుభాష్ చంద్ర దీక్షిత్ తన కుటుంబంతో దేవ్లా గ్రామ సమీపంలోని గోకుల్ధామ్ కాలనీలో నివసిస్తున్నారు. అతని కుమారుడు నిఖిల్ 12వ తరగతి చదువుతున్నాడు. అతనికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బోర్డు పరీక్ష జరుగుతోంది. గత బుధవారం షాపులో సరుకులు కొనేందుకు ఇంటి నుంచి బయటికి వచ్చాడు. ఇరుగుపొరుగున నివాసముంటున్న శంకర్‌ అనే యువకుడు నిఖిల్‭ను బైక్‌పై తీసుకెళ్లాడని స్థానికులు తెలిపారు.

Maharashtra: దేవేంద్ర ఫడ్నవీస్ అరెస్టుకు ఉద్ధవ్ ప్రభుత్వం కుట్ర.. ఆలస్యంగా వెలుగులోకి తెచ్చిన మహా సీఎం షిండే

విద్యార్థిని అడవికి తీసుకెళ్లిన శంకర్‌తో పాటు మరో ఇద్దరు యువకులు ఇనుప రాడ్‌లు, బెల్టులతో విద్యార్థిని కొట్టారు. ఇరుగుపొరుగున ఉండే మహిళతో ఎందుకు మాట్లాడుతున్నాడని కొడుతున్న సమయంలో అన్నారట. కొట్టిన దెబ్బలో నిఖిల్ రెండు కాళ్లు, ఒక చేయి విరిగింది, దాని కారణంగా అతను పరీక్షకు హాజరు కాలేకపోయాడు. నిఖిల్ శరీరంలోని చాలా భాగాలకు కూడా గాయాలయ్యాయి. కాగా, దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదు రోజులు గడుస్తున్నా ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేకపోవడం గమనార్హం.