×
Ad

Medchal Jeedimetla : మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో దారుణం.. ప్రేమించిన యువతి కళ్లెదుటే ప్రియుడి హత్య

మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో పరువు హత్య తీవ్ర కలకలం రేపుతోంది. నడిరోడ్డుపై యువకుడిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన నగరంలో అలజడి రేపింది.

  • Published On : March 3, 2023 / 01:48 PM IST

KILL

Medchal jeedimetla : మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో పరువు హత్య తీవ్ర కలకలం రేపుతోంది. నడిరోడ్డుపై యువకుడిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన నగరంలో అలజడి రేపింది. ప్రేమించిన యువతి కళ్లెదుటే ప్రియుడిని దుండగులు దారుణంగా హత మార్చారు. మృతుడిని సూరారం కాలనీ అరవై గజాల ప్రాంతానికి చెందిన దేవరకొండ హరీష్ గా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో దూలపల్లి రహదారిలో వస్తుండగా యువకుడిపై కొందరు దుండగులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఆరు నెలల కిందటే హరీశ్ కుటుంబం సూరారం కాలనీకి వచ్చినట్లు తెలుస్తోంది. అంతకముందు ఎల్లారెడ్డి గూడలో నివాసమున్న సమయంలో ముస్లిం యువతిని హరీశ్ ప్రేమించినట్లు తెలుస్తోంది.

Man Shot Daughter: పరువు హత్య.. ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురును కాల్చి చంపిన తండ్రి.. సహకరించిన తల్లి

యువతి బంధువులు హెచ్చరించినా హరీశ్ ఆమెను పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో పగతో రగిలి పోయిన యువతి బంధువులు పక్కా ప్లాన్ ప్రకారం హరీశ్ ను దారుణంగా హత్య చేసి అమ్మాయిని తీసుకెళ్లి పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు పరువు హత్యగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.