TikTok సెలబ్రెటీ షారూఖ్ ఖాన్ అరెస్టు

  • Publish Date - September 4, 2019 / 02:50 PM IST

TikTokలో సెలబ్రెటీగా ఉన్న షారూఖ్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గ్రేటర్ నోయిడాలో దొంగతనం కేసులో ఇతడితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. షారూఖ్ ఖాన్ (23)కి టిక్ టాక్‌లో 40 వేల మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇతను 2019, సెప్టెంబర్ 04 బుధవారం మధ్యాహ్నం 12.30గంటల ప్రాంతంలో స్నేహితులతో కలిసి అల్ఫా 2 ఏరియాలో మరో దోపిడికి పాల్పడేందుకు ప్రయత్నించాడని పేర్కొన్నారు. అసీఫ్, ఫైజాన్, ముకేష్‌లుగా గుర్తించారు. 

వీరి వద్ద నుంచి వివిధ బ్రాండ్లకు సంబంధించి నాలుగు మొబైల్ ఫోన్స్, రూ. 3 వేల 520 నగదు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. షారూఖ్ ఖాన్‌తో పాటు ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్‌గా ఏర్పడే వారని, ఇద్దరు వ్యక్తులు బైక్‌లపై తిరుగుతూ దొంగతనం చేసేందుకు రెక్కీ చేసే వారన్నారు.

అనంతరం దొంగతనం చేసే వారని, షారూఖ్ ఖాన్, ఫైజాన్, ఆసీఫ్‌లు బులంద్‌షహర్ జిల్లాకు చెందిన వారు కాగా..ముఖేష్ బీహార్ రాష్ట్రానికి చెందిన వారన్నారు. బేటా 2 పీఎస్‌లో దీనికి సంబంధించిన దానిపై కేసు నమోదు చేసినట్లు, లోకల్ కోర్టులో వీరిని హాజరు పరుస్తామన్నారు. 
Read More : ఇక జింగిలాలో : జియో ఫైబర్‌ వచ్చేసింది