టిక్ టాక్ వీడియోలో పెద్ద విలన్‌గా ఫోజులు కొట్టిన అశ్విని కుమార్ (30) తుపాకీతో కాల్చుకుని చనిపోవడం సంచలనం సృష్టించింది. యూపీ రాష్ట్రంలో బర్హాపూర్ ప్రాంతంలో ఏరియాలో బస్సులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతను మూడు హత్యలలో ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడని సమాచారం. తనకు తాను విలన్‌గా చిత్రీకరిస్తూ టిక్ టాక్‌లో వీడియోలను పోస్టు చేస్తుండేవాడు. నేను ప్రతిదీ నాశనం చేస్తాను..డెవిల్ ఇప్పుడు సిద్ధంగా ఉంది..నేను సృష్టించే విలయం చూడండి అంటూ ఫేస్ బుక్‌లో పోస్టింగ్ చేసేవాడు.
ఎలాంటి క్రిమినల్ రికార్డు లేనప్పటికీ స్థానిక బీజేపీ లీడర్ కుమారుడిని, అతని మేనల్లుడిని చంపిన కేసులో నిందితుడు. ఇతనిపై రూ. లక్ష రివార్డు ప్రకటించారు పోలీసులు. తన మాట వినడం లేదని..ఓ యువతిని హత్య చేశాడు. వారం రోజులుగా ఇతని కోసం పోలీసులు అన్వేషణ చేస్తున్నారు. భయపడి అతను ఢిల్లీకి పారిపోయేందుకు డిసైడ్ అయ్యాడు. అక్టోబర్ 06వ తేదీ పోలీసులు అశ్వినీ కుమార్ ఎ ఎక్కిన బస్సును పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
దీంతో భయపడి..తన దగ్గరున్న తుపాకీని తీసుకుని కాల్చుకుని చనిపోయాడు. ఈ ఘటనతో బస్సులో ఉన్న వారు తీవ్రభయాందోళనలకు గురయ్యారు. అతని వద్ద పిస్టల్, రెండు మ్యాగజైన్స్, 14 పేజీల నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అశ్విని గ్రాడ్యుయేట్ చదివాడు. ఇతని తండ్రి చెరకు సహకార సంఘంలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. సోదరుడు డెహ్రాడూన్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రైవేటు సంస్థలో పనిచేసిన అశ్విన్ కొద్దికాలం తర్వాత ఆ ఉద్యోగం వదిలేశాడు. డ్రగ్స్‌కు బానిస అయ్యాడని అతని కుటుంబం భావిస్తోంది.
Read More : అమెరికాలో మరోసారి కాల్పులు : నలుగురు మృతి