Tribal Women
Tribal Woman Paraded Naked : వివాహేతర సంబంధాలు కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. పలు దారుణ ఘటనలు కూడా జరిగాయి. తాజాగా.. వివాహేతర సంబంధం ఉందనే కారణంతో వివాహితను, యువకుడిని నగ్నంగా ఊరేగించారు. ఈ అమానవీయ ఘటన జార్ఖండ్ లో చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని.. దీనికి కారణమని గ్రామస్తులపై కేసు నమోదు చేశారు. జార్ఖండ్ లోని డుంకా జిల్లాలో బడ్తల్లి పంచాయతీ పరిధిలో ఓ గ్రామానికి చెందిన గిరిజన మహిళ కుటుంబం నివాసం ఉంటోంది.
Read More : Huzurabad By Election : కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ? బై పోల్‌ను లైట్‌గా తీసుకుందా ?
ఈమె కూలీ పనులు చేసుకుంటూ…జీవనం సాగించేది. అయితే..ఓ నేరం కేసులో భర్త జైలుకు వెళ్లాడు. ఈ క్రమంలో…ముగ్గురు పిల్లలతో ఈమె జీవిస్తోంది. కూలీ పనులు చేసే సమయంలో…అదే గ్రామానికి చెందిన గిరిజనేతర యువకుడితో ఈమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా..అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇతడిని పెళ్లి చేసుకుంది. అప్పటికే అతనికి పెళ్లయి ముగ్గురు పిల్లలున్నారు. ఈ నేపథ్యంలో…2021, సెప్టెంబర్ 28వ తేదీ..మంగళవారం మహిళ ఇంటికి వెళ్లడాన్ని గ్రామస్తులు గమనించారు.
Read More : Goa Politics : కాంగ్రెస్ కు బిగ్ షాక్..టీఎంసీలో చేరిన గోవా మాజీ సీఎం
తీవ్ర ఆగ్రహానికి గురైన వారు..ఆ యువకుడిని పట్టుకున్నారు. మహిళను కూడా పట్టుకుని… వివస్త్రలను చేయించారు. అనంతరం నగ్నంగా వారిని ఊరేగించారు. దాదాపు కిలోమీటర్ మేర గ్రామం మొత్తం తిప్పారు. ఘటనను మొత్తం వీడియో తీశారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులకు ఈ విషయం తెలిసింది. ఘటనాప్రదేశానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గ్రామ ప్రధాన్ తో సహా…ఐదుగురు గ్రామస్తులను అరెస్టు చేశారు.